ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. గత కొన్ని సినిమాలు వరుస హిట్స్ ని అందుకుంటున్నాయి.. ప్రస్తుతం
మార్కెట్ లో
ఎన్టీఆర్ కి మంచి డిమాండ్ ఉంది.. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్ కూడా అడుగుతున్నాడు.. ఈ కారణంగానే
తారక్ తన 30వ చిత్రం 'దేవర' చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్
డైరెక్టర్ అయిన
కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ
సినిమా పాన్
ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందించబడింది. దాంతో
సినిమా పై హైప్ ఏర్పడింది..
సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
జూనియర్
ఎన్టీఆర్ లీడ్ రోల్లో నటిస్తున్న 'దేవర పార్ట్-1' షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాపై రోజురోజుకూ ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.తాజాగా ఈ
సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ
సినిమా క్లైమాక్స్ ఫైట్ విషయంలోనే చాలావరకు ఖర్చు చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దాంతో పాటుగా దానికి భారీగా సీజీ వర్క్ కూడా ఉండడంతో ఆ ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఒక్క ఫైట్ వల్ల
సినిమా టాక్ మొత్తం మారిపోతుంది అనే ఉద్దేశ్యంతోనే ఆ ఫైట్ ని చాలా గ్రాండ్ గా తెరకెక్కిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే
గ్రాఫిక్స్ వర్క్ లో కూడా ఎక్కడ తగ్గకుండా ఫైట్ లో ఉన్న ఫీల్ మిస్ అవ్వకుండా ఉండే విధంగా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసం ప్రొడ్యూసర్స్ తో విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టిస్తున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి.
మరి దానికి అనుకూలంగానే ఈ సినిమాతో
కొరటాల శివ ఒక భారీ
సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు… అందువల్లే ఈ ఫైట్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.అయినప్పటికీ
సినిమా సక్సెస్ అయితే పర్లేదు కానీ ఫెయిల్యూర్ అయితే మాత్రం
ప్రొడ్యూసర్ కి భారీగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా చూసుకుంటే మంచిది అంటూ కొంతమంది సినీ విమర్శకులు దేవర
సినిమా యూనిట్ ని హెచ్చరిస్తున్నారు…ఇక ఈ విషయం పక్కన పెడితే
ఎన్టీయార్ –
కొరటాల కాంబినేషన్ లో ఇంతకు ముందే వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంత పెద్ద హిట్ అయితే సాధించిందో అలాగే ఈ
సినిమా కూడా అంతకు మించి భారీ బ్లాక్ బాస్టర్
సక్సెస్ ని సాధించాలని వాళ్లు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పాన్
ఇండియా లెవెల్లో
ఎన్టీఆర్ సత్తా చాటుకుంటాడని అతని అభిమానులు కూడా మంచి ఆశ భవాన్ని వ్యక్తం చేస్తున్నారు…దేవర
సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇదిలావుండగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ నటుడు నటిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ యాక్టర్ బాబీ దేవోల్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. పార్ట్- 1 క్లైమాక్స్లో బాబీ క్యారెక్టర్ రివీల్ కానుందట. ఇక సెకండ్ పార్ట్లో బాబీది ఫుల్ లెంగ్త్ రోల్ ఉండనుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే బాబీ క్యారెక్టర్ గురించి మేకర్స్ త్వరలోనే ఓ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.