టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్తలో వరుస విజయాలను అందుకుంటు చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ సరైన విజయాలను అందుకోవడం లేదు. కొంత కాలం క్రితం ఎన్టీఆర్ హీరోగా రూపొందిన టెంపర్ మూవీ తో సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత అనేక అపజయాలను అందుకొని ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్లీ ఈయన అపజయాలను అందుకుంటున్నాడు.
కొంత కాలం క్రితం ఈయన లైగర్ మూవీ కి దర్శకత్వం వహించగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా పూరి జగన్నాథ్ "డబల్ ఇస్మార్ట్" మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇకపోతే పూరి జగన్నాథ్ కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా పైసా వసూల్ అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేదు.
ఇకపోతే ప్రస్తుతం వరుస అపజాయలతో డీలా పడిపోయిన పూరి జగన్నాథ్ , బాలకృష్ణ హీరోగా ఓ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి ఓ కథను వివరించినట్లు బాలయ్య కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో ఓ మూవీ లో నటిస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ల తర్వాతే పూరి జగన్నాథ్ , బాలయ్య సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.