ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఇమాన్వి.. ఎవరీ ముద్దుగుమ్మ..?
ప్రభాస్తో కలిసి ఆమె చేస్తున్న సినిమా 1940ల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ పిరియడ్ డ్రామాలో ప్రభాస్ ఒక సైనికుడు, ఒక యోధుడిగా తన మాతృదేశం కోసం పోరాడుతుంటాడు. ఈ సినిమాతో ఇమాన్వి చాలా పాపులర్ అవుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఆమెకు తెలుగులో హిందీలో వరుసగా అవకాశాలు వస్తాయి. ఈ బ్యూటీ చాలా అందంగా ఉంది కాబట్టి హీరోలు కూడా ఈ ఫ్రెష్ ఫేస్ తో నటించడానికి చాలా ఆసక్తి కనబరచవచ్చు.
మునుపు ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించబోతుందని వార్తలు వచ్చాయి. కానీ తాను ఈ సినిమాలో నటించడం లేదని ఆమె ఇన్స్టాగ్రామ్లో స్పష్టం చేసింది. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి ప్రముఖ నటులతో పాటు ఇమాన్వి కూడా నటిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 చివరి నాటికి థియేటర్లలో విడుదల కావచ్చు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నది విశాల్ చంద్రశేఖర్. విశాల్ ఇప్పటికే ఈ సినిమాకు మూడు పాటలు కంపోజ్ చేశాడని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.