దేవర సాంగ్స్ కి అక్కడ సూపర్ క్రేజ్..!!

murali krishna
 గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, వసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవర పార్ట్ -1 తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 5న ఈ మూవీ నుంచి ''చుట్టమల్లె'' అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది.ఈ పాటకి ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటలో ఎన్టీఆర్ లుక్స్, జాన్వీ కపూర్ గ్లామర్ అదిరిపోయింది. ఇద్దరి జోడీ మ్యూజిక్ కి తగినట్లు డ్యాన్స్ చేయడం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పాట చిత్రీకరించిన లొకేషన్స్, తారక్ - జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ గూస్ బాంబ్స్ తెప్పించాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పా రావు తన గొంతుతో మెస్మరైజ్ చేసేసింది.దేవర ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా ఎలా ఉండబోతుందో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా జాన్వీ కపూర్ ఎక్కువ డేట్స్ కేటాయించనున్నారని సమాచారం అందుతోంది. ఆడియన్స్ అంచనాలను మించి దేవర మూవీ సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది.
ఇదిలావుండగా ఈ సినిమాలోని ఫియర్, చుట్టమల్లే సాంగ్స్ అభిమానులకు కిక్కెక్కి స్తున్నాయి.తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అమెరికాలోని చికాగోలో లైవ్ ప్రదర్శన ఇచ్చారు.ఆ రెండు పాటలకు 11,000 మంది ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ క్రేజ్ అలాంటిది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: