నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తాజాగా అభిరామికి ఇన్‌స్టాలో ఓ చేదుఅనుభవం ఎదురైంది. తన వద్ద 24 ఏళ్ల పాటు మేకప్ మేన్‌గా పనిచేసిన ప్రసాద్‌ను అభిరామి ఇంట్రడ్యూస్ చేసింది. తనతో 24 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ తమిళంలో న అనే అక్షరాన్ని పలకడం ప్రసాద్‌కు అస్సలు రావడం లేదని చెప్పుకొచ్చింది. నాలుకను మడతపెట్టి జ అనే అక్షరాన్ని పలకడాన్ని ఆమె నేర్పించే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిక్స్డ్ కామెంట్స్ వస్తున్నాయి. కావాలనే మేకప్ మ్యాన్‌ను అవమానించిందని కొందరు కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌పై అభిరామి స్పందించింది.
కెమెరాలో మాట్లాడుతుంటే అంత అందంగా లేవు ఆంటీ మేడమ్ అని కొందరు అన్నారు. దానికి రిప్లై ఇస్తూ అలాంటప్పుడు అస్సలు చూడకు అని కౌంటర్ ఇచ్చింది. యాక్టింగ్ మానేశారా? మేకర్ వేసుకోవడం తెలీడం లేదా? అనే ఇంకో కామెంట్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చింది. మేకప్ వేయడం అతని వృత్తి అని, ఆ వృత్తిని తానెందుకు దుమ్మెత్తి పోస్తానని బదులిచ్చింది. ఇలా వరుసగా కౌంటర్లు ఇస్తుండటంతో మరో యూజర్..ఇలా కామెంట్స్‌కు రిప్లైలు ఇచ్చేది మీరేనా? అని అడగ్గా.. టైం దొరికినప్పుడు ఆన్సర్స్ ఇస్తానని అభిరామి సమాధానం ఇచ్చింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.