నా కూతుర్ని అనాధని చేశారు.. అక్కినేని ఫ్యామిలీ పై సమంత తండ్రి షాకింగ్ కామెంట్స్..?

Pandrala Sravanthi
అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నారనే సంచలన విషయం బయటపడడంతో సమంత తండ్రి అక్కినేని ఫ్యామిలీ పై ఫైర్ అయినట్టు యూట్యూబ్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే సమంత తండ్రి అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లి మరీ గొడవ చేశారా అనేది ఇప్పుడు చూద్దాం.నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నాక ఆమె ఎంత నరకం అనుభవించిందో చెప్పనక్కర్లేదు.సమంత అనుభవించిన నరకం వర్ణతాతీతం. ఇకలేనిపోని తలనొప్పులు తెచ్చుకొని చివరికి తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని మయాసైటిస్ బారిన పడింది. ఇక తాజాగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో తన కూతురిపై అంత మంది ట్రోల్స్ చేసినా విమర్శించినా కూడా ఒక్క మాట మాట్లాడని అక్కినేని ఫ్యామిలీ పై కోపంగా ఉన్న సమంత తండ్రి తాజాగా వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ గొడవ చేశారట.మీరు మీ కొడుకు రెండో పెళ్లి చేసుకుంటే చేసుకోండి.దానికి నేను అడ్డుపడను.


కానీ విడాకుల తర్వాత నా కూతురు అంత మానసిక బాధ అనుభవించినా కూడా మీరు ఒక్కరు కూడా బయటికి వచ్చి సమంత తప్పులేదు అని నోరు విప్పలేదు. నా కూతుర్ని ఒక అనాధలా చేసేసి మీరందరూ మీ పనులు చూసుకున్నారు. నా కూతురు ఎంత మానసిక వేదన అనుభవించిందో అందరికీ తెలుసు. ఆమెను పిచ్చిదానిలా చేసి మీరు మాత్రం  మీ కొడుకు రెండో పెళ్లి చేస్తున్నారు. అయితే రెండో పెళ్లికి నేను అడ్డు అనడం లేదు కానీ నాకూతుర్ని అన్ని మాటలన్నా  మీరు సైలెంట్ గా ఉన్నారు.ఎంతైనా మీ కొడుకు మొదటి భార్యగా సమంతకు ఓ విషయంలో అన్యాయం జరిగితే మీరు నోరు విప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మాత్రం కాస్త కూడా స్పందించలేదు. మయాసైటిస్ వచ్చినా కూడా కనీసం ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడగలేదు.


మూడేళ్లు మీ ఇంట్లో ఉండి మీ కొడుకు కు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంది. మీరు చెప్పిన పనులన్నీ చేసింది. కనీసం ఒకచుట్టపు చూపుగా సమంతను పలకరించాలి అని అనిపించలేదా అంటూ సమంత తండ్రి నాగార్జున ఇంటికి వెళ్లి మరీ తన ఆవేదనను వ్యక్తం చేశారట. అలాగే వారు గొడవలు పడుతున్న సంగతి తెలుసు. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుందని నేను సైలెంట్ గా ఉన్నాను. ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళు కలుస్తారని అనుకున్నాను. అయితే వారి గొడవ చిలికిచిలిక గాలి వానలా మారి విడాకులకు దారి తీస్తూందనే విషయం నాకు తెలియదు..అంటూ సమంత తండ్రి బాధపడ్డారట.అయితే సమంత తండ్రి నాగార్జున ఇంటికి వెళ్లి గొడవ చేశారనే వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: