టాలీవుడ్ యాక్టర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారని తెలిసిందే. అభిమానులు మాత్రం సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాడన్న ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇంకా సెట్స్‌పైనే ఉంది 'ఓజి'.రెండు వారాలు పవన్ డేట్స్ ఇస్తే చాలు ఈ సినిమా పూర్తైపోతుంది. ఓజిపై ఒక్క అప్డేట్ వస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టారు సుజీత్.డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించి పవన్ ఇంకా 20 రోజులు వర్క్ చేయాల్సి ఉంది. మూవీ ట్రయిలర్ ఆల్రెడీ రెడీగా ఉంది.పవన్ కళ్యాణ్ లైనప్‌లో అందరినీ ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న మూవీ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ప్రీలుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనే ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది. పైగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది.ఇకపోతే గ్లిమ్స్ లో వచ్చిన ‘హంగ్రీ చీతా’ థీమ్ సాంగ్ బిట్ కి మిలియన్స్ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అన్నీ మ్యూజిక్ ప్లాట్ ఫారమ్స్ లో ఇప్పటికీ ఈ ఆడియో బిట్ ట్రెండింగ్ అవుతూనే ఉంది.ఈ కథ మూడు వేర్వేరు కాలాల్లో జరుగుతాయట. పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా మూడు విభిన్నమైన గెటప్స్ లో ఉంటాయి.
ఓల్డ్ ఏజ్ లుక్ లో కూడా ఆయన ఇందులో కనిపించబోతున్నాడట. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా టీజర్ తో పాటు సెప్టెంబర్ 2 న హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నుండి కూడా అప్డేట్స్ రానున్నాయట. వీటితో పాటు ‘గబ్బర్ సింగ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వబోతుంది. ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊపిరి కూడా ఆడనంత ఆనందాన్ని కలిగించే అప్డేట్స్ ఆరోజు ఉండనున్నాయి.ఉపముఖ్యమంత్రి అయ్యాక కేవలం రాజకీయాలకు సంబంధించిన వార్తలనే అభిమానులు గత రెండు నెలలుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ చూడబోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ సుజిత్ టీజర్ మరియు ట్రైలర్ ని కట్ చేసి చాలా రోజులు అయ్యిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చెయ్యబోయే టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా చెప్తాడని తెలుస్తుంది.ఈ సినిమాతో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్' కి సంబంధించిన షూట్లో కూడా పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారనే టాక్ నడుస్తుంది. ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ రానుంది.