పుష్ప 2.. దేవర షూటింగ్ అప్డేట్స్ ఇవే.. పాన్ ఇండియా మూవీస్ తుది దశకు చేరినట్టేనా..?
పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
దేవర : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాదు లోని జూబ్లీ హిల్స్ లో ఓ సాంగ్ ను షూట్ చేస్తోంది.