నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ‘అఖండ’. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై దద్దరిల్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య నటనకు థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించాయనే చెప్పవచ్చు.నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ‘అఖండ 2’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లో బోయపాటి చాలా బిజీగా ఉన్నాడు. ఐతే, స్క్రిప్ట్ దాదాపు ఫినిష్ కావడంతో, ప్రస్తుతం బోయపాటి నటీనటుల ఎంపిక పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది.బాలయ్య,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ సంచలన విజయాలను సొంతం చేసుకోగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న అఖండ2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.మరోసారి బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న అఖండ2 పై ఆడియోన్స్ కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు రెడీ కావడంతో.. ప్రస్తుతం నటీ, నటుల ఎంపిక చేసే పనిలో బోయపాటి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మేకర్స్ ఎక్కువగా బాలీవుడ్ నటీ, నటులను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అఖండ-2 లో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఇప్పుడు అఖండ2లో బాలయ్య సరసన ‘కత్రినా కైఫ్’ నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజందో తేేలియదు కానీ, ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే. ఇకపోతే వీరిద్దరూ గతంలో అల్లరి పిడుగు అనే చిత్రంలో కలిసి నటించారు. ఒకవేళ అఖండ2లో నిజంగా కత్రినా నటిస్తున్నట్లయితే మళ్లీ 20 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ తెర పై కనిపించనున్నారు.మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా పై బాలయ్య అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.