పెళ్లయిన ఏడాదికే శర్వానంద్ విడాకులు..?

frame పెళ్లయిన ఏడాదికే శర్వానంద్ విడాకులు..?

Pandrala Sravanthi
ఏంటి హీరో శర్వానంద్ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నాడా.. ఈ మధ్యనే శర్వానంద్ దంపతులకు పాప పుట్టింది కదా.. ఇంత సడన్గా విడాకులు తీసుకోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు.. ఇంతకీ శర్వానంద్ కి తన భార్యతో ఎలాంటి గొడవలు వచ్చాయి.. ఎందుకు ఇంత షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు అని ఈ వార్త విన్న శర్వానంద్ అభిమానులు అందరూ ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు. మరి ఇంతకీ శర్వానంద్ విడాకులు ఎందుకు తీసుకోబోతున్నారు.. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ టైరు -2 హీరోల్లో ఒకరైన శర్వానంద్ మంచి మంచి కాన్సెప్టు లు ఎంచుకుంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం వచ్చిన మనమే మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డప్పటికీ వరుస ప్రాజెక్టులు చేస్తూ హిట్ కొట్టాలని చూస్తున్నారు శర్వానంద్.అయితే అలాంటి ఈయన సినీ కెరీర్ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న సమయంలో శర్వానంద్ విడాకులు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతుంది. 

అయితే విడాకులు అనగానే నిజంగానే శర్వానందే విడాకులు తీసుకుంటున్నారని అందరూ భావిస్తారు. కానీ అసలు విషయం మీరు అనుకునేది కాదు.ఎందుకంటే శర్వానంద్ విడాకులు తీసుకోవడం లేదు.ఇక శర్వానంద్ విడాకులు అంటూ వార్తలు వచ్చేవి తన సినిమాకి సంబంధించిన న్యూస్.. శర్వానంద్ ప్రస్తుతం ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పారట.అయితే ఆ సినిమా మొత్తం విడాకులు చుట్టే తిరుగుతుందట.అలా సామజవరగమన మూవీ దర్శకుడు అబ్బరాజు దర్శకత్వంలో ప్రస్తుతం శర్వానంద్ ఈ విడాకుల నేపథ్యంలో వచ్చే సినిమాలో నటిస్తున్నారట.ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత గొడవలు పడి విడాకుల కోసం తిరిగే స్టోరీలో శర్వానంద్ హీరోగా చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన సమయంలో కోర్టు రూంలో ఎలాంటి వాదనలు జరుగుతాయి, ఎలాంటి డ్రామా జరుగుతుంది అనే నేపథ్యంలో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారట. దీంతో శర్వానంద్ విడాకులు అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు హీరోయిన్స్ గా చేస్తున్నారు.మరి ఈ విడాకుల కాన్సెప్ట్ తో శర్వానంద్ సినిమా చేస్తున్న దాంట్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు మాత్రం టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ని కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి శర్వానంద్ విడాకుల కాన్సెప్ట్ తో వచ్చే సినిమా ఏ విధంగా ఉండబోతుందో ఈ సినిమాకి సంబంధించిన ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో త్వరలోనే బయటపడబోతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: