మ్యాడ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఆయ్. ప్రతిష్టాత్మక GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తుండగా. అంజి కె.మణిపుత్ర దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. నయన్ సారిక కథానాయికగా చేస్తోండగా రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.ఈ ఆగస్టు నెలలో రిలీజ్ కి రెడీ అయిన చిత్రాల్లో ఆయ్ ఒకటి. ఈ చిత్రం నుండి రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆమాంతం అంచనాలను పెంచేసింది. ట్రైలర్ ఆద్యంతం కామెడీ సన్నివేశాలతో ఉండటంతో సినిమా ప్రేక్షకులని బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఆగస్టు 15 నుండి థియేటర్ల లో అందుబాటులో ఉండనున్న ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన వివరాలను మేకర్స్ వెల్లడించారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.ఆగష్టు 15న ఆయ్ సినిమాతో పాటు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీనితో పాటు తమిళం నుంచి తంగలాన్ వస్తుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభం అయింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా శ్రీలీల హాజరుకానున్నట్లు ప్రకటించారు. బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి అల్లు అరవింద్ యొక్క గీతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది క్యూట్ బ్యూటీ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తోనూ కలిసి నటిస్తూ కెరీర్ ను మాంచి స్వింగ్ లో తీసుకెళ్తోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ వరుస అవకాశాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. రీసెంట్ గా మహేష్ బాబుతో కలిసి ‘గుంటూరు కారం’ సినిమాలో నటించింది.