విడాకులు నిజమే.. హాట్ బాంబు పేల్చిన అభిషేక్ బచ్చన్..!

frame విడాకులు నిజమే.. హాట్ బాంబు పేల్చిన అభిషేక్ బచ్చన్..!

Divya
 బాలీవుడ్ సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్  జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ తెర మీదనే కాకుండా తెర బయట కూడా చూడముచ్చటగా ఉంటుంది.  2007లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే అమ్మాయి కూడా జన్మించింది. అలా 16 సంవత్సరాలు సంతోషంగా సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. దీనికి తోడు అన్ని మీడియా ఛానల్స్ లో కూడా ఈ వార్తలు జోరుగా వినిపించాయి.
ఇక ఈ వార్తలు ఇప్పుడు వీరి వరకు చేరడంతో అసహనం కోల్పోయిన అభిషేక్ బచ్చన్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు
 అవును విడాకులు నిజమే.. ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండి.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. నాకు, ఐశ్వర్య కు జీవితంలో ఎలా ఉండాలో తెలుసు.. ఒకరి పైన ఒకరికి ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు.. మీరు వచ్చి మా మధ్య ఇలాంటి విభేదాలు సృష్టించాల్సిన అవసరం లేదు. అసలు పుకార్లకు మేము చోటు ఇవ్వము అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు తమ జీవితంలో మూడో వ్యక్తి వచ్చి ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన తెలిపారు.
మొత్తానికి అయితే విడాకులపై వస్తున్న రూమర్లకు స్పందించిన అభిషేక్ బచ్చన్ వాటికి చెక్ పెట్టారు . ఇకనైనా ఈ రూమర్లు ఆగిపోతాయేమో చూడాలి. అయితే గత కొద్ది రోజులుగా అభిషేక్ బచ్చన్,  ఐశ్వర్యరాయ్ ఇద్దరు కలసి కనిపించిన దాఖలాలు లేవు. పైగా అనంత్ అంబానీ పెళ్లిలో కూడా ఎవరికి వారు విడిగా కనిపించారు. దీంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. కానీ ఇప్పుడు అభిషేక్ బచ్చన్  స్పందించేసరికి ఈ రూమర్స్ కి  కాస్త చెక్ పడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: