రవితేజను అస్సలు వదలరా.. మరి నాలుగోసారి..?

frame రవితేజను అస్సలు వదలరా.. మరి నాలుగోసారి..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించాడు. ఇక ఈయన ఆ తర్వాత సినిమాలలో హీరోగా అవకాశాలను దక్కించుకోవడం , ఈయన నటించిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటు రావడంతో కొంత కాలంలోనే రవితేజ తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోల స్థాయికి చేరుకున్నాడు.

ఇది ఇలా ఉంటే రవితేజ తో ఈ మధ్య కాలంలో ఆ నిర్మాణ సంస్థ వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఆ సంస్థ ఏది అనే వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు కొంత కాలం క్రితం రవితేజ తో ధమాకా అనే సినిమాను నిర్మించింది. ఆ తర్వాత ఈ నిర్మాణ సంస్థ వారు రవితేజ హీరో గా ఈగల్ అనే మూవీ ని నిర్మించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. 

తాజాగా ఈ సంస్థ వారు రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు రవితేజ హీరోగా మూడు సినిమాలను నిర్మించారు. మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల కాకముందే ఈ బ్యానర్ వారు రవితేజ తో మరో సినిమాకు కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నాలుగోసారి రవితేజ తో మూవీ చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: