చరణ్ పై ఆధారపడి ఉన్న "ఇండియన్ 3" భవిష్యత్తు..?

frame చరణ్ పై ఆధారపడి ఉన్న "ఇండియన్ 3" భవిష్యత్తు..?

Pulgam Srinivas
ఇండియాలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితమే అద్భుతమైన టెక్నాలజీతో సినిమాలను తెరకెక్కించి వాటితో సూపర్ సక్సెస్లను అందుకోవడంతో శంకర్ కి దర్శకుడిగా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే శంకర్ , రజనీ కాంత్ హీరోగా ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా రూపొందిన రోబో సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత శంకర్ పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అందులో ఏ మూవీ కూడా రోబో స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేదు.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం శంకర్ "ఇండియన్" అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. శంకర్ హీరో గా రూపొందిన ఈ సినిమా టైమ్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 అనే మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ జూలై 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే శంకర్ "ఇండియన్ 2" మూవీ తో పాటు రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను కూడా రూపొందించాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి మూవీ బృందం సన్నాహాలు చేస్తుంది. ఇకపోతే శంకర్ ఇప్పటికే ఇండియన్ 3 కి సంబంధించిన చాలా భాగం చిత్రీకరణను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ 2 కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఇండియన్ 3 ని కూడా చాలా తక్కువ రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉండేది. కానీ ఈ మూవీ ఫ్లాప్ కావడంతో శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మళ్లీ శంకర్ క్రేజ్ పెరుగుతుంది. దానితో ఇండియన్ 3 విడుదల అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మరి గేమ్ చేంజర్ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: