కేవలం ఫస్ట్ ఆఫ్ విని ఆ సినిమాను ఓకే చేసిన రవితేజ.. రిసల్ట్ మాత్రం షాకింగ్..?

frame కేవలం ఫస్ట్ ఆఫ్ విని ఆ సినిమాను ఓకే చేసిన రవితేజ.. రిసల్ట్ మాత్రం షాకింగ్..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా ... హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో రవితేజ వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.

అందులో భాగంగా రవితేజ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా మాట్లాడుతూ ఓ సినిమాను కేవలం ఫస్టాఫ్ కథ మాత్రమే విని ఓకే చేసినట్లు , కానీ దాని రిజల్ట్ షాకింగ్ గా వచ్చినట్లు తెలియ జేశాడు. అసలు ఆ సినిమా ఏది ..? దానికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రవితేజ మాట్లాడుతూ ... నేను సినిమా హిట్ , ఫ్లాప్ గురించి పెద్దగా పట్టించుకోను.

అలాగే సినిమా కథ మొత్తం విని కూడా దానిని ఓకే చేయాలి అనుకోను. కొన్ని సంవత్సరాల క్రితం నేను కిక్ అనే సినిమాలో నటించాను. సురేందర్ రెడ్డి ఆ సినిమా కథను చెబుతున్నప్పుడు నేను మొదటి సగ భాగం కథ మాత్రమే విన్నాను. అందులోనే నా పాత్ర క్యారెక్టర్జేషన్ నాకు బాగా నచ్చింది. దానితో మరో సగం కథ వినకుండానే ఆ మూవీ ని ఓకే చేశాను. ఇక సినిమా విడుదల అయిన తర్వాత అది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే అందులోని నా పాత్రకు కూడా అద్భుతమైన ప్రశంసలు దక్కాయి అని రవితేజ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కిక్ మూవీ లో ఇలియానా హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: