విజయ్ సేతుపతి : బాధలో ఉంటే ఆ మూవీ రిపీట్ మోడ్ లో చూసే వాడ్ని..!!

frame విజయ్ సేతుపతి : బాధలో ఉంటే ఆ మూవీ రిపీట్ మోడ్ లో చూసే వాడ్ని..!!

murali krishna
ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది సూపర్ స్టార్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఒకరు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోలీవుడ్‌కు చెందిన అతడు.. అన్ని భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'మహారాజ' అనే సినిమాను చేశాడు.దక్షిణాది, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, విలక్షణ నటుడిగా రాణిస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహరాజ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలు మించి వసూళ్లను రాబడుతున్నది. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొంటూ కాసుల పంటను కురిపిస్తున్నది.విజయ్ సేతుపతి తన కెరీర్‌లో 50వ చిత్రంగా రూపొందిన మహారాజ అత్యధిక వసూళ్లను సాదించే సినిమాగా ఓ రికార్డు దిశగా ప్రయాణిస్తున్నది. ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్లు తన సినిమాలకు రాలేదనేది వాస్తవం. సోలో హీరోగా బాక్సాఫీస్‌ను ఆయన షేక్ చేస్తుండటం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెరిగింది.ఇప్పుడు ఓటీటీలోనూ మహారాజ మూవీ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.ఈ నేపథ్యంలో తన కష్టకాలంలో మహేష్ బాబు నటించిన ఓ సినిమాను ఎన్నోసార్లు చూసినట్లు అతడు వెల్లడించాడు.

మహేష్ బాబుకు సాధారణ అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్సే అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. తమిళ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన విజయ్ సేతుపతి ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మహేష్ నటించిన అతడు మూవీ గురించి చెబుతూ.. తాను హీరోగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆ సినిమాను ఎన్నోసార్లు చూసినట్లు చెప్పాడు.
విజయ్ సేతుపతి కొంత కాలం కిందట ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నుంచి ఒక వీడియో క్లిప్ ను ఈ మధ్య మహేష్ బాబు, అతడు మూవీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అతడు సినిమాకు మరో సెలబ్రిటీ అభిమాని దొరికాడంటూ ఆ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఈ మూవీ గురించి చేసిన కామెంట్స్ వీడియోను షేర్ చేశారు. అందులో ఈ సినిమాపై విజయ్ తమిళంలో మాట్లాడటం చూడొచ్చు.
తన కష్టకాలంలో ఈ అతడు సినిమాను చాలాసార్లు చూసినట్లు ఆ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపాడు. మొదట షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. తర్వాత తమిళ ఇండస్ట్రీలో ఓ నటుడిగా నిలదొక్కుకోవడానికి విజయ్ చాలానే శ్రమించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈ సినిమా నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు చెప్పాడు. ఆ మూవీలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రతి ఒక్కటీ తనకు గుర్తుందని అన్నాడు. ఇక మహేష్, త్రిష మధ్య కెమెస్ట్రీ కూడా చాలా బాగుందని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: