టాలీవుడ్ సెలబ్రెటీస్: పెళ్లి తర్వాత.. ఈ సెలబ్రిటీల జాతకమే మారిపోయిందిగా..!
వెంకటేష్:
పెళ్లి తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారట. 1985లో వెంకటేష్ వివాహం కాగా కలియుగ పాండవులు సినిమాతో 1986లో సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.
2). చిరంజీవి:
అగ్ని సంసారం సినిమా చిరంజీవి కెరీర్ లోనే చాలా స్పెషల్ అట. చిరంజీవి ,సురేఖ పెళ్లి 1980 ఫిబ్రవరి 20న జరిగింది.. ఆ మరుసటి రోజే చిరంజీవి నటించిన అగ్ని సంసారం చిత్రం విడుదలయ్యింది.
3) మహేష్ బాబు:
మహేష్ బాబు, నమ్రత 2005లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అతడు సినిమాని రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.
4). జూనియర్ ఎన్టీఆర్:
ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం 2011లో జరిగింది. పెళ్లి తర్వాత విడుదలైన చిత్రం ఊసరవెల్లి.
5). రామ్ చరణ్:
2012లో ఉపాసనను ప్రేమించి వివాహం చేసుకున్నారు.. పెళ్లి తర్వాత నాయక్ సినిమాను విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.
6). అల్లు అర్జున్:
ప్రముఖ రాజకీయ వేత్త కూతురు స్నేహారెడ్డిని ప్రేమించి 2011లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత బద్రీనాథ్ సినిమాని విడుదల చేసి డిజాస్టర్ ను మూట కట్టుకున్నారు.
7). బాలకృష్ణ:
బాలకృష్ణ, వసుంధర వివాహం 1982లో జరిగింది. వివాహం తర్వాత నటించిన బాలయ్య చిత్రం సింహం నవ్వింది, సాహసమే జీవితం వంటి చిత్రాలతో పేరు సంపాదించుకున్నారు.
8). నాగార్జున:
1984లో దగ్గుపాటి లక్ష్మీని వివాహం చేసుకోగా.. 1986లో నటించిన మొదటి చిత్రం విక్రమ్ విడుదలయ్యింది. ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకొని హీరోయిన్ అమలని ప్రేమించి మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత అంతం సినిమాని విడుదల చేసి అందుకున్నారు.