వామ్మో: ఇదేం ప్రేమరా నాయనా.. హీరోయిన్ కోసం.. ఒక నౌక..100 ఐఫోన్లు... భారీ గిఫ్ట్స్..!

frame వామ్మో: ఇదేం ప్రేమరా నాయనా.. హీరోయిన్ కోసం.. ఒక నౌక..100 ఐఫోన్లు... భారీ గిఫ్ట్స్..!

Divya
కేరళలోని వాయనాడ్ విధ్వంసం వల్ల చాలామంది అక్కడ ప్రజలు బాధితులుగా మారిపోయారు. స్టార్ హీరోలు , హీరోయిన్ సే కాకుండా సెలబ్రిటీల సైతం చాలామంది కొన్ని కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ప్రభాస్ రెండు కోట్లు, చిరంజీవి రామ్ చరణ్ కోటి రూపాయలు అల్లు అర్జున్ 50 లక్షలు, సంయుక్త కోటి రూపాయలు ఇలా చాలామంది సెలబ్రిటీలు సైతం తమకు తోచిన విధంగా కొంతమేరకు సహాయాన్ని చేశారు.. కానీ ఇప్పుడు వీరందరిని మించి మరి ఏకంగా 15 కోట్ల రూపాయలు సుకేష్ చంద్రశేఖర్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా హీరోయిన్ జాక్వెలియన్ ఫెర్నాండేజ్ బర్తడే కానుకగా ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా చాలానే ఇచ్చినట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

నిన్నటి రోజున జాక్వెలియన్ ఫెర్నాండేజ్ బర్తడే కానుకగా జైలు జీవితం గడుపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ ఒక లేఖ ద్వారా తెలియజేశారు.. ఈయన జైలులో ఉన్నప్పటికీ కూడా భారీగా విరాళాలు ఇవ్వడంతోపాటు జాక్వెలియన్ ఫెర్నాండేజ్ కు భారీ బహుమతులు ఇచ్చినట్లుగా ఒక లేఖన సైతం రిలీజ్ చేశారు..జాక్వెలియన్ ఫెర్నాండేజ్ ప్రతి పుట్టినరోజుకి ఈమె అందం మరింత రెట్టింపు అవుతూనే ఉంది.. తాజాగా సుకేశ్ చంద్ర ఈమె పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రైవేట్ జెట్, మాట్చ్ డైమండ్, బికినీలు ఆమెకు ఆనందాన్ని ఇవ్వవని.. అందుకే వాయనాడు బాధితుల కోసం అంత మొత్తంలో సహాయం చేశారని కూడా తెలియజేశారు సుఖేష్.

అక్కడ సహాయం చర్యలకు సైతం 15 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అక్కడ ప్రజలకు 300 ఇల్లు కూడా కట్టిస్తానంటూ తెలియజేశారట. కేరళ ప్రభుత్వం తో మాట్లాడేందుకు ఒక టీం ని కూడా పంపించానని తెలియజేశారు. సుఖేష్ జాక్వెలియన్ ఫెర్నాండేజ్ బర్త్డే సందర్భంగా కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది.. ఇందులో పాల్గొన్న వారిలో 100 మందిని సైతం ఎంపిక చేస్తారట.. వారందరికీ ఐఫోన్ -15 ప్రో బహుమతులుగా ఇస్తానని తెలియజేశారు.. విజేతలను కూడా ఆయనే ప్రకటించారట. ఇలా బాధితుల కోసం 15 కోట్లు, 300 ఇళ్లతో పాటు అభిమానులకు 100 ఐఫోన్లు ఇచ్చినటువంటి సుకేష్..జాక్వెలియన్ ఫెర్నాండేజ్ మై బేబీ గర్ల్, మై బొమ్మ జాకెలిన్ అంటూ తెలియజేశారు. అంతేకాకుండా ఆమె కోసం ఒక ప్రైవేట్ మాట్చ్ కొని మరి ఆమెకు గిఫ్ట్ ఇచ్చారట. దాని పేరు లేడీ జాక్విలిన్ పెట్టినట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా జాక్విలియన్ లేకుండానే సెలబ్రేషన్ చేసుకున్న రెండవ బర్తడే ఇది అంటూ తెలిపారు. మరి ఈ విషయం పైన ఈ ముద్దుగుమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: