పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలను మిస్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏ మూడు సినిమాలను పవన్ రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ గారికి ఇడియట్ , అమ్మా నాన్న తమిళ అమ్మాయి , పోకిరి సినిమాల కథలను వినిపించాను.
ఆయన కథలు విని బాగానే ఉన్నాయి అన్నాడు. కాకపోతే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత ఆ కథలతో సినిమాలు చేసే విషయంలో ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. దానితో నేను ఆ సినిమాలను వేరే వాళ్ళతో తీశాను అని చెప్పుకొచ్చాడు. అలా పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలను మిస్ చేసుకున్నట్లు పూరి జగన్నాథ్ తెలియజేశాడు. ఇకపోతే ఇడియట్ మూవీ లో రవితేజ హీరో గా నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో రవితేజ కు మంచి గుర్తింపు లభించింది.
ఇక అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలో కూడా రవితేజ హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో రవితేజ క్రేజ్ తెలుగు లో మరింత పెరిగింది. ఇకపోతే పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించాడు. ఈ మూవీ ఆ టైమ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో మహేష్ బాబు క్రేజ్ కూడా ఫుల్ గా పెరిగిపోయింది. ఇలా ఈ మూడు బ్లాక్ బస్టర్ మూవీ ల కథలను పూరి జగన్నాథ్ మొదట పవన్ కే వినిపించగా ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ కథలను వేరే హీరోలతో చేసినట్లు పూరి జగన్నాథ్ తెలియజేశాడు.