నేచురల్ స్టార్ నాని దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశాయి.సరిపోదా శనివారం సినిమాపై హైప్ భారీ స్థాయిలో ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ వస్తోంది. ఇటీవలే వచ్చిన ఓ గ్లింప్స్ విపరీతంగా పాపులర్ అయింది. అందరికీ తెగనచ్చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆగస్టు 29వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సరిపోదా శనివారం ట్రైలర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తోంది. ట్రైలర్ డేట్‍ను కూడా వెల్లడించింది.సరిపోదా శనివారం ట్రైలర్ ఆగస్టు 13వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఆగస్టు 10) అధికారికంగా వెల్లడించింది. "సోకులపాలెం జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎంతో ఎగ్జైట్ చేసే సరిపోదా శనివారం ట్రైలర్ ఆగస్టు 13న తీసుకొస్తున్నాం” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పోస్ట్ చేసింది. జనాలు గోడవైపు ఆసక్తిగా చూస్తుండగా.. అది కాస్త చీలి ట్రైలర్ ఆగస్టు 13న వస్తుందనే వీడియోను కూడా పోస్ట్చేసింది.సరిపోదా శనివారం సినిమాలో సూర్య అనే క్యారెక్టర్ చేశారు నాని. శనివారం మాత్రమే కోపం చూపించే హీరో కాన్సెప్ట్‌తో ఈ చిత్రం వస్తోంది. ఈ పాయింట్‍పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఎస్‍జే సూర్య విలన్ పాత్ర పోషించారు.ఎస్‍జే సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే సరిపోదా శనివారం నుంచి నాట్ ఏ టీజర్ అంటూ గ్లింప్స్ వచ్చింది. దీనికి అదిరే రెస్పాన్స్ వచ్చింది. అక్రమాలు చేసే పోలీస్ ఆఫీసర్ ఎస్‍జే సూర్యను నాని, ప్రియాంక ఎదుర్కొంటారనేలా ఈ గ్లింప్స్ ఉంది. ఈ వీడియోలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా పాపులర్ అయింది. ఈ మూవీకి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.