రిలీజ్ కి ముందే మిస్టర్ బచ్చన్ ను మించిపోయిన డబల్ ఈస్మార్ట్..?

frame రిలీజ్ కి ముందే మిస్టర్ బచ్చన్ ను మించిపోయిన డబల్ ఈస్మార్ట్..?

Pulgam Srinivas
కొన్ని సందర్భాలలో ప్రేక్షకులు సినిమాలు చూద్దాము అన్నా థియేటర్లలో మంచి సినిమాలు ఉండని సందర్భాలు ఉంటాయి. ఇక మరికొన్ని సందర్భాలలో ఒకే సారి కట్టకట్టుకొని సినిమాలన్నీ థియేటర్లలో దిగుతూ ఉంటాయి. దానితో ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో పడుతూ ఉంటాడు. ఇక అలాంటి సందర్భమే ఆగస్టు 15 వ తేదీన రాబోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ , మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన డబుల్ ఇస్మార్ట్ రెండు సినిమాలు కూడా ఇదే తేదీన విడుదల కాబోతున్నాయి.

ఇకపోతే ఇప్పటికే ఈ రెండు మూవీ యూనిట్లు ఈ సినిమాలకు సంబంధించిన ప్రచారాలను కూడా జోరుగా ముందుకు తీసుకు వెళుతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు కూడా విడుదల అయ్యాయి. ఈ మూవీల ట్రైలర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ సినిమాలు విడుదల అయిన తర్వాత ఏ సినిమాకి మంచి టాక్ వస్తే ఆ మూవీ కి భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇకపోతే విడుదలకు ముందే ఓ విషయం లో మిస్టర్ బచ్చన్ సినిమాని డబల్ ఈ స్మార్ట్ మూవీ మించి పోయింది. అది ఎందులో అనుకుంటున్నారా రన్ టైమ్ లో. మిస్టర్ బచ్చన్ మూవీ యూనిట్ ఈ సినిమాలు దాదాపుగా 2 గంటల 30 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే డబల్ ఈస్మార్ట్ మూవీ బృందం మాత్రం ఈ సినిమాని 2 గంటల 42 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రన్ టైమ్ విషయంలో మిస్టర్ బచ్చన్ కంటే డబల్ ఇస్మార్ట్ మూవీ కాస్త ఎక్కువ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: