తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో
రామ్ పోతినేని ఒకరు.
రామ్ ఆఖరుగా ఈస్మార్ట్
శంకర్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన ది
వారియర్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన
మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పాన్
ఇండియా మూవీ లో
హీరో గా నటించాడు.
ఈ
సినిమా కూడా అద్భుతమైన అంచనాల నడుమ విడుదల అయింది. కాకపోతే ఈ
మూవీ కూడా
రామ్ కి నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే ఈస్మార్ట్
శంకర్ మూవీ తో
రామ్ పోతినేని కి మంచి విజయం దక్కింది. దానితో
పూరి జగన్నాథ్ ,
రామ్ పోతినేని హీరోగా తాజాగా
ఇస్మార్ట్ శంకర్ సినిమాకి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ అనే పేరుతో ఓ
మూవీ ని రూపొందించాడు. ఈ
మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ పర్వాలేదు అనే స్థాయిలోనే ప్రచారాలను చేస్తూ వస్తుంది.
ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ బృందం ఈ నెల 12 వ తేదీన
వరంగల్ లో ఈ
మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో
రామ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు. దానితో
వరంగల్ లో ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.