సొట్ట బుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో అవకాశాలు భారీగా పెరిగాయి. కాకపోతే విజయాలు మాత్రం ఆ స్థాయిలో దక్కలేదు. ఈమె నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో ఈమె తన ఇంట్రెస్ట్ ను బాలీవుడ్ సినిమాలపై పెట్టడం మొదలు పెట్టింది.
అందులో భాగంగా ఈమెకు హిందీ లో కూడా మంచి అవకాశాలు దక్కాయి. అలాగే ఈమె నటించిన చాలా బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అయ్యాయి. దానితో ఈమె క్రేజ్ హిందీ సినీ పరిశ్రమలో బాగా పెరిగింది. ఇకపోతే ఈమె హిందీ లో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో కాకుండా వైవిధ్యమైన సినిమాలలో , నటనకు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలలో నటించింది. అలాగే ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న జాలి డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.