షాక్: శోభిత-నాగచైతన్య లవ్ ఎప్పుడు పుట్టిందో పోస్ట్ చేసిన సమంత..!

frame షాక్: శోభిత-నాగచైతన్య లవ్ ఎప్పుడు పుట్టిందో పోస్ట్ చేసిన సమంత..!

Divya
నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నాగచైతన్య, శోభిత, సమంత పేర్లు ఫోటోలు మాత్రమే వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా శోభిత, నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నిన్నటి రోజున పూర్తి కావడం చేత వీరిద్దరి కుటుంబాలకు సంబంధించిన ఫోటోలు కూడా హైలెట్ గా మారుతున్నాయి. దీంతో శోభిత, చైతన్య ఎక్కడ పరిచయమయ్యారు అసలు వీరిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైంది అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి. తాజాగా చైతన్య, శోబితా ప్రేమ గురించి శోభిత చెల్లెలు సమంత ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.

హీరోయిన్ శోభిత చెల్లెలు పేరు కూడా సమంత అన్న సంగతి తెలిసిందే.. అయితే ఈమె డాక్టర్ గా చేస్తోందట. ఇదివరకే ఈమెకు వివాహం అయ్యింది. తాజాగా తన సోదరి శోభిత, నాగచైతన్య నిశ్చితార్థం సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అసలు విషయాలను చెప్పేసింది.. శోభిత, చైతు ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ 2022 నుంచి అన్నట్లుగా రాసుకొచ్చింది సమంత.. దీని ఉద్దేశం ఏమిటంటే చైతు, శోభిత ఇద్దరు ప్రేమ కూడా 2022లోనే మొదలయ్యిందనే విషయం అభిమానులు తెలియజేస్తూ ఉండగా ఈ విషయం విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

చైతన్య 2017లో హీరోయిన్ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు . కానీ 2021లో వీరిద్దరు విడిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్నటువంటి నాగచైతన్య 2002లో శోభితతో ఏర్పడిన పరిచయం తనని మనిషిగా చేసిందని ఆ తరువాత శోభితని ప్రేమించినట్లుగా సమాచారం. త్వరలోనే వీరిద్దరి వివాహ తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చైతన్య, శోభిత ప్రేమ ఎప్పుడు పుట్టింది అనే విషయం పైన ఎట్టకేలకు సమంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాగచైతన్య తల్లి కూడా వీరి ఎంగేజ్మెంట్ కి హాజరయ్యింది.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: