మహేష్ కల్ట్ క్లాసిక్ మూవీకి 19 ఏళ్లు..!!

frame మహేష్ కల్ట్ క్లాసిక్ మూవీకి 19 ఏళ్లు..!!

murali krishna
టాలీవుడ్‌లో కొన్ని సినిమాలుంటాయి. ఏళ్ళు గ‌డిచిన వాటికి ఎక్స్‌పైరీ డేట్ ఉండ‌దు. చూసిని ప్ర‌తి సారిగా కొత్త‌గా ఎంట‌ర్టైన్ చేస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘అత‌డు’ ఒక‌టి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఓ క‌ల్ట్ క్లాసిక్‌. సినిమా వ‌చ్చి 19ఏళ్ళు దాటినా ఇప్ప‌టికి టీవీల్లో వ‌స్తుందంటే అతుక్కుపోతుంటాం. తిన‌గా తిన‌గా వేప తియ్య‌నుండు లాగా, అత‌డు సినిమా ఎన్ని సార్లు చూసినా.. ప్ర‌తి సారి ఓ కొత్త అనుభూతిని పొందుతూనే ఉంటాం. క‌థ‌, క‌థ‌నం, త్రివిక్ర‌మ్ డైలాగ్స్, న‌టీన‌టులు ప‌ర్‌ఫార్మెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క‌టేమిటీ ప్ర‌తి ఫ్రేమ్, ప్రతి షాట్ అద్భుతమే. ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌కు ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా నాజ‌ర్ పోషించిన మూర్తి రోల్ మాత్రం ప్ర‌శంస‌నీయం. ‘ఈ వ‌య‌స్సులో నాకు కావాల్సింది నిజాలు, అబద్ధాలు కావు.. జ్ఞాప‌కాలు’ ఈ ఒక్క డైలాగ్‌తోనే ఆ పాత్ర స్వ‌భావం ఎంటో తెలిసిపోతుంది.పోలాండ్ లో విడుదలైన తొలి తెలుగు సినిమాగా "అతడు"గుర్తింపు పొందింది 2005లో ఉత్తమ నటుడు ఉత్తమ మాటల రచయిత ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నంది అవార్డులు గెలుచుకుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్.అతడు థియేటర్ లలోనే కాదు, టీవీలో కూడా కొత్త రికార్డులు సృష్టించింది.ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా రేటింగ్ మాత్రం వస్తూనే ఉంది.జనాలు ఈ సినిమాని ఇదివరకే చూసిన మళ్ళీ ప్రసరిస్తే మళ్ళీ మళ్ళీ చూసారు.
దీనికి కారణం ఒక్కటే అని చెప్పలేం.దీనికి చాలా కారణాలు ఉన్నాయి.2005 ఆగస్టు 10న అతడు సినిమా విడుదలైంది.ఈ సినిమా మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ని అందించింది.ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ మాటల గురించి అయితే చెప్పనక్కర్లేదు.ప్రతి సీన్ లో తన మార్క్ కనిపిస్తుంది.ఇక ఈ సినిమాలో మరో ప్లస్ త్రిష.ఇక ఈ సినిమాలో లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా గురూజీ అద్భుతంగా రాసారు.నేను వస్తా అని పూరి అడిగితే నేనే వస్తా అని పార్థు చెప్పే సీన్ అయితే విజిల్స్ వేయించింది.ఈ ఒక్క సీన్ మాత్రమే కాదు అతడు సినిమాలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన టైమింగ్ డైలాగులు ఉన్నాయి.అప్పటివరకు డబ్బు కోసం చంపడానికి అయినా సిద్ధంగా ఉండే పార్థు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది.అక్కడి నుంచి సినిమా మరోస్థాయికి వెళ్తుంది.ఫ్యామిలీలో కలిసిపోయి అదే ఫ్యామిలీ బంధానికి దగ్గరైపోతాడు.ఇక అక్కడ పార్థు-పూరికి జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.ఇక పొలంలో జరిగే సీన్ అయితే ఇప్పటి మిమర్స్ బాగా వాడుకుంటున్నారు.ఈ సినిమా టీవీలో రికార్డు సృష్టించడానికి ముఖ్య కారణం కథ, నటన అనే చెప్పాలి.ఈ సినిమాలో పాటలు, కామెడీ సీన్ లు, ఫైట్ లు, డైలాగులు అద్భుతంగా ఉండడంతో టాప్ రేటింగ్ వచ్చింది.ఇప్పుడు ఇదే తరహాలో బాహుబలిని కూడా ప్రసరిస్తున్నారు.కానీ ఈ రికార్డుని అందుకోవడం అంటే ఇంకా టైం పడుతుంది.అయితే ఈ సినిమా ముందు పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉండింది.ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి కథ వినిపిస్తే పవన్ లైట్ గా తీసుకున్నారు.ఆ తరువాత మహేష్ కి చెబితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: