మెగా, నందమూరి ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ న్యూస్..ఒకే వేదికపై బాలయ్య, చిరంజీవి..?

frame మెగా, నందమూరి ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ న్యూస్..ఒకే వేదికపై బాలయ్య, చిరంజీవి..?

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో ఎంతలా ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రియాలిటీ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇందులో పలువురు టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కల్యాణ్, రవితేజ, రానా, చంద్రబాబు పాల్గొని సందడి చేశారు. అయితే ఈ షో గతంలో అతిథుల కొరత కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో బాలయ్య అన్‌స్టాపబుల్ కొత్త సీజన్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. విజయ దశమి నుంచి ఈ సీజన్ మొదలు పెట్టే ఆలోచనలో ఆహా సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ షో లో పలువురు రాజకీయ నాయకులను, జంటలను పిలవబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ఆనందానికి కారణం అయింది.ఇప్పటికే విశేష ఆదరణతో మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్త సీజన్‌ కోసం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ షో ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా పూర్తైనట్లు తెలిసింది.అయితే ఈ కొత్త సీజన్‌ను సరికొత్త సర్‌ప్రైజ్‌లతో సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, డైరెక్టర్స్‌, ఇతర సెలబ్రిటీలతో సందడి చేసిన ఈ షో ఇప్పుడు మరింత ఫుల్‌ జోష్‌తో సాగేలా మేకర్స్‌ ప్లాన్ చేశారట.అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు సమాచారం. చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదిక పంచుకుంటుండటంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ సారి సీజన్లో చిరంజీవితో పాటు నాగార్జున ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా బాలయ్య-చిరు అభిమానుల మధ్య గొడవలు పీక్స్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు పోటీ తగ్గడంతో పాటు జనసేన టీడీపీ కలిసి పనిచేయడం ఆసక్తికరం. ఇక ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే, అభిమానులకు అంతకుమించిన వినోదం ఏముంటుంది చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: