సినీ ఇండస్ట్రీలో నట వారసులుగా వచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో తమిళ స్టార్ హీరో సూర్య ఒకరు. విలక్షణమైన తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో అయ్యారు.తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. తన సహనటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. తమిళంలో ఏ సినిమా రిలీజ్ అయిన వెంటనే తెలుగులో డబ్ చేస్తుంటారు. గత కొంత కాలంలో నేషనల్ వైడ్ గా తన మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆకాశం నీ హద్దురా, జై భీం లాంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘కంగువా’ పాన్ ఇండియా వైడ్ గా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.తాజాగా కంగువా నుంచి లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.కోలీవుడ్ స్టార్ సూర్య , డైరెక్టర్ శివ కాంబినేషన్ లో కంగువ మూవీ తెరకెక్కబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో సూర్యకు జోడిగా బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తోంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. దీనితో ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా అక్టోబర్ 10న భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టిగ్ అప్ డేట్ వచ్చేసింది. అదేంటంటే.. మూవీ రిలీజ్ కు ఇంకా రెండు నెలలు సమయం ఉండగానే.. అప్పుడే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆగష్టు 12 న కంగువ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు . ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.సూర్యపై ఒక పవర్ఫుల్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. ఇది మాత్రం క్రేజీ లెవెల్లో ఉందని చెప్పాలి. సూర్య తన సాలిడ్ మేకోవర్ లో కనిపిస్తుండగా తన వెనుక ఉన్న రెండు రెక్కలతో యూనిక్ గా డిజైన్ చేశారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం చేపట్టారు.