ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రెడీ అవుతున్న పుష్ప-2 సినిమా రిలీజ్ కోసం ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉన్నారు.అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. దీనికి కారణాలు ఏమైనా.. రూమర్ మాత్రం..మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఇంటికి వెళ్లడమే అనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరిగింది. అందుకే మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు బన్నీ సినిమాను చూసేందుకు ఇష్టపడటం లేదనే టాక్ నడుస్తోంది.ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాను ఉద్దేశించినవే అంటున్నారు నెటిజన్లు. దీంతో సోషల్ మీడియాలో అప్పుడే ప్రచారం జోరందుకుంది. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవుల్ని కాపాడేవారని.. కాని ఇప్పుడు ఏకంగా హీరోలు అడవుల్లో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని కామెంట్ చేశారు పవన్ కల్యాణ్.అసలే సినిమా రిలీజ్ లేటవుతోందని ఫీలవుతున్న బన్నీ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ కామెంట్స్ తో ఖంగుతిన్నట్లైంది. నిజంగా అల్లు అర్జున్ పుష్ప2 సినిమా సమాజానికి తప్పుడు మెసేజ్ ఇచ్చే విధంగా ఉందనే మాటను పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పడం కాకుండా.. సినిమాపై అంచనాలను తగ్గించే విధంగా.. ఆడియన్స్ లో నెగిటివ్ ఒపినియన్ కలిగించారనే ప్రచారం కూడా మొదలైంది.ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు. అతనిలో ఒక మంచి టెక్నీషియన్ కూడా ఉన్నాడు. అతను స్క్రిప్ట్ రాయగలడు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇలా సినిమాకి సంబంధించి ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయో అన్నిటి మీద పట్టు ఉన్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే ఆయన అందరిలో అంత స్పెషల్. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం లో జానీ అనే చిత్రం వచ్చింది.
ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది కానీ, టెక్నీకల్ గా, టేకింగ్ పరంగా అసలు పవన్ కళ్యాణ్ ఇంత అడ్వాన్స్ గా ఎలా ఆలోచించాడు అని ఇప్పుడున్న ఆడియన్స్ మొత్తం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయన సత్యాగ్రహి అనే సినిమా కూడా తన స్వీయ దర్శకత్వం లో ప్రారంభించాడు కానీ, ఎందుకో కొన్ని అనివార్య సంఘటనల వల్ల ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించాడు.
ఇదంతా పక్కన పెడితే, ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఓకే అయ్యిందని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదనే విషయం చాలా మందికి తెలియదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, అప్పట్లో అల్లు అర్జున్ ని టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేసే ఆలోచనలో ఉన్న అల్లు అరవింద్ అనేక స్టోరీలు వింటున్నాడు.కానీ ఎందుకో ఏ స్టోరీ కూడా ఆయనకీ ఒక పట్టాన నచ్చడం లేదు . దీంతో గతం లో అల్లు అరవింద్ కి పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక స్క్రిప్ట్ గుర్తొచ్చి, ఇది అల్లు అర్జున్ తో తీస్తే అదిరిపోతోంది అనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ని సంప్రదించాడు. ఆయన కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సుముఖత తోనే ఉన్నాడు. ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం అయ్యింది కానీ, ఎందుకో చివరి నిమిషం లో ఆయనకీ స్క్రిప్ట్ లో కొన్ని పర్ఫెక్ట్ గా లేవు అనిపించింది. నూటికి నూరు శాతం తనకి సంతృప్తి ఇవ్వకపోవడం తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే అట్టకెక్కింది. అలా పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో లాంచ్ అవ్వాల్సిన అల్లు అర్జున్, చివరికి ‘గంగోత్రి’ సినిమాతో లాంచ్ అయ్యాడు.