అవతార్ ఫ్రాంచైజ్ లో మూడో పార్ట్.. ఈ సారి అంతకు మించి విజువల్స్ తో..!!
ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు జేమ్స్ కామెరూన్ దీని గురించి మాట్లాడుతూ.. ‘ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టిపెడుతున్నాము. మంచి కథనంతో భారీ విజువల్స్‌తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్‌ని ఇందులో చూడవచ్చు. మరో కొత్త ప్రపంచాన్ని భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో కనిపించిన కేట్ విన్స్‌లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో మరింత పొడిగించాం. అందుకోసం ఆమె చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటుంది’ అని చెప్పారు. అవతార్ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు జేమ్స్ కామెరూన్ దీని గురించి మాట్లాడుతూ.. ‘ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టిపెడుతున్నాము. మంచి కథనంతో భారీ విజువల్స్‌తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్‌ని ఇందులో చూడవచ్చు. మరో కొత్త ప్రపంచాన్ని భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో కనిపించిన కేట్ విన్స్‌లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో మరింత పొడిగించాం. అందుకోసం ఆమె చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటుంది’ అని చెప్పారు. అవతార్ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.