మహేష్ మ్యానియాలో తలంబ్రాలు !

frame మహేష్ మ్యానియాలో తలంబ్రాలు !

Seetha Sailaja
టాప్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో పై చూపించే అభిమానం ఎవరి ఊహలకు అందని విధంగా మారిపోతోంది. తమ హీరోల పుట్టినరోజునాడు అదేవిధంగా తమ హీరో నటించిన సినిమా విడుదల రోజునాడు అభిమానులు చేసే హడావిడి ఎప్పుడు హాట్ టాపిక్ గా మీడియాలో వార్తలుగా మారుతుంది. లేటెస్ట్ గా మహేష్ పుట్టినరోజునాడు రీ రిలీజ్ అయిన ‘మురారి’ మూవీ ధియేటర్ల వద్ద సూపర్ స్టార్ అభిమానులు సృష్టించిన హంగామా చాలామందికి హాట్ టాపిక్ గా మారింది.

ఈ మూవీ విడుదలై అనేక సంవత్సరాలు అయినప్పటికీ అనేకసార్లు ఈ మూవీ టీవీలలో ప్రసారం అయినప్పటికీ ఈసినిమాను ధియేటర్లలో మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఎగబడటమే కాకుండా ఈసినిమాకు మొదటిరోజు 3 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ వచ్చాయి అన్న వార్తలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఇక బెంగుళూరులో కూడ ఈమూవీ మొదటిరోజు మార్నింగ్ షోలు ఫుల్ అయి హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం మాహేశ్ స్టామినాకు ఋజువుగా మారింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కొన్ని ధియేటర్లలో అయితే కొబ్బరి ఆకులు మామిడి ఆకులతో మండపం కట్టి పెళ్ళి పీట కూడ వేసి పెళ్ళి మండపంగా ధియేటర్లలో డెకరేట్ చేయడం మరింత షాకింగ్ గా మారింది. ఇక ఈసినిమాకు సంబంధించి ‘అలనాటి రామచంద్రుడు’ పాట వస్తున్నప్పుడు మహేష్ అభిమానులు తలంబ్రాల బియ్యం పంచిపెట్టి మరింత ఆశ్చర్యానికి గురిచేశారు. ఈసినిమా రీ రిలీజ్ అయిన రోజునే చాల చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. ఏ ధియేటర్లలోను కనిపించని ఈ హంగామా ‘మురారి’ ధియేటర్లలో కనిపించడంతో ఈసినిమాను మరొకసారి చూడటానికి వచ్చిన ప్రేక్షకులు షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మహేష్ కు సంబంధించి రీ రిలీజ్ అయిన సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటే మహేష్ రాజమౌళీల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ఓపెనింగ్ కలక్షన్స్ ఏస్థాయిలో ఉంటాయో అంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు ఊపు అందుకుంటున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: