సలార్ 2 ఉందా లేదా.. ఉంటే ఎప్పుడు..?

frame సలార్ 2 ఉందా లేదా.. ఉంటే ఎప్పుడు..?

shami
ప్రభాస్ తో లాస్ట్ ఇయర్ డిసెమర్ లో సలార్ 1 గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడన్నది నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ గా ఉంచాడు. ఓ పక్క కె.జి.ఎఫ్ 3 చేస్తాడని వార్తలు రాగా అజిత్ తో కె.జి.ఎఫ్ ఫ్రాంచైజ్ ప్లానింగ్ లో ఉన్నాడని కొందరు చెప్పుకొచ్చారు. కట్ చేస్తే నేడు ఎన్టీఆర్ తో సినిమా ముహుర్తం పెట్టేశాడు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఈ కాంబో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుందే అయినా కూడా సడెన్ గా శుక్రవారం పూజా చేశారు. అంతేకాదు పూజా రోజే ముహుర్తం డేట్ కూడా వేశారు.
2026 జనవరి 9న ప్రశాంత్ నీల్, తారక్ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఈ సినిమా 2026 దాకా పడితే మరి ప్రభాస్ తో చేయాల్సిన సలార్ 2 పరిస్థితి ఏంటని రెబల్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ కి మాస్ అటెన్షన్ తెచ్చిన సినిమాల్లో సలార్ 1 ఒకటి. సలార్ 1 సీజ్ ఫైర్ లో ప్రభాస్ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడని తెలిసిందే. ఇక అసలు కథ సలార్ 2 శౌర్యాంగ పర్వం లోనే ఉందని అనుకున్నారు.
కానీ ప్రశాంత్ నీల్ వ్యవహారం చూస్తుంటే సలార్ 2 పై ఆసక్తి లేదన్నట్టుగా ఉంది. డార్లింగ్ ప్రభాస్ తనతో చేసిన డైరెక్టర్స్ అందరితో చాలా జోవియల్ గా ఉంటాడు. కానీ ప్రశాంత్ నీల్ సలార్ ని రెండు భాగాలు చేయడం ప్రభాస్ కి ఇష్టం లేదని అందుకే సలార్ 2 ని డైరెక్టర్, హీరో ఇద్దరు చేసే మూడ్ లో లేరని చెప్పుకుంటున్నారు. ఐతే హోంబలె నిర్మాతలు మాత్రం కచ్చితంగా సలార్ 2 ని పూర్తి చేయాలనే అనుకుంటున్నారు. ఐతే మధ్యలో ఎన్ టీ ఆర్ సినిమా చేసి ఆ తర్వాత సలార్ 2 చేస్తాడని చెప్పొచ్చు. అంటే 2027 దాకా సలార్ 2 పై హోప్స్ పెట్టుకోవడం వేస్ట్ అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: