ఆ విషయంలో చాలామంది నన్ను విమర్శించారు - కీర్తి సురేష్..!
తను పని చేసే విషయంలో సంతోషంగా ఉన్నప్పటికీ తనకు నచ్చిన చిత్రాలలో నటించినప్పటికీ చాలా సినిమాలు ఫ్లాప్ అవడం తనకు చాలా బాధను కలిగించాయని ఆ బాధను మర్చిపోదాం అనుకునే సమయానికి ట్రోల్స్ ఎదురవ్వడం వల్ల చాలా బాధనిపిస్తుంది అంటూ తెలిపింది. తనకు తెలిసి అత్యధికంగా దక్షిణాదిలోనే ట్రోల్స్ ఎదుర్కొన్న నటి తనే కావచ్చు అంటూ తెలిపింది. అయితే మహానటి సినిమా తర్వాత తన మీద ట్రోల్స్ కాస్త తగ్గాయని విమర్శకులు నుంచి సరికొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపింది
2000 సంవత్సరంలో మలయాళంలో నటించిన పైలెట్ చిత్రంతో మొదటిసారిగా చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత పెంగ్విన్, పాంభు సత్తాయ్ , నేను లోకల్, మహానటి, సర్కార్ వారి పాట తదితర చిత్రాలను నటించింది. గత ఏడాది వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నది ఈ ముద్దుగుమ్మ. దసరా సినిమాలో తన పాత్రకు ఫిలింఫేర్ అవార్డు రావడంతో చాలా ఆనందంగా ఉందంటూ తెలిపింది. ఇటీవల రఘు తాత అనే సినిమాని పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే బాలీవుడ్లో బేబీ జాన్ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది.