పవన్ హరిహర వీరమల్లు లో ఆ బాలీవుడ్ స్టార్ యాక్టర్..!!

frame పవన్ హరిహర వీరమల్లు లో ఆ బాలీవుడ్ స్టార్ యాక్టర్..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ భారతీయ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ ‘హరి హర వీరమల్లు’లో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయన అత్యంత విలువైన, గౌరవనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు టీం అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తో తెరను పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అభిమానులను ఎంతగానో అలరిస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిని అందిస్తుందని అంటున్నారు. ఇటీవల, యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకొని, సినిమాపై అంచనాలను పెంచే ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ఒక‌టి. ఈ సినిమాను మూడేళ్ల క్రితం ప్ర‌క‌టించి మూడేళ్లు దాటింది. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంచెం షూట్ చేయడం, మళ్ళీ ఆగిపోవడం జరుగుతూనే ఉంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వ‌డం కూడా ఈ మూవీ ఆల‌స్యానికి ఓ కార‌ణం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను మొద‌లుపెట్ట‌గా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 17వ శతాబ్దానికి చెందిన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వారియర్ గా నటిస్తున్నారు. అప్పుడెప్పుడో ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. గ‌త‌కొంత‌కాలంగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో అభిమానులంతా ఎంతో నిరాశ‌లో ఉన్నారు.ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వర‌లోనే మిగిలిన సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. రెండు భాగాలుగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: