నాగచైతన్య ఫ్యాన్స్ కు మరో తీపికబురు.. ఎంగేజ్‌మెంట్ వేళ దానికి గ్రీన్ సిగ్నల్
మరోసారి థ్రిల్లర్ కథాంశంతో కార్తీక్ మూవీ చేసేందుకు సిద్దమయ్యాడు. విరూపాక్ష నిర్మాత బివిఎస్ఎన్.ప్రసాద్ నిర్మాణ సారధ్యంలోనే చైతూతో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. కథ కూడా చైతూకు బాగా నచ్చిందట. అందుకే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తండేల్ మూవీ షూట్‌తొో బిజీగా ఉన్న చైతూ ఆ మూవీ తర్వాత కార్తీక్ దండుతో సినిమా చేయనున్నాడు. కార్తీక్ కూడా విరూపాక్ష మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయినా కూడా పక్కా స్క్రిప్ట్‌తో ఈసారి చైతూతో భారీ హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. చైతూ కెరీర్ లోనే ఈ భారీ బడ్జెట్ మూవీగా నిలవనుంది. ఓ వైపు శోభితాతో నిశ్చితార్థం, మరో వైపు తన సినీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ చేయడంతో అక్కినేని ఇంట పండగ వాతావరణం నెలకొంది. నాగ చైతణ్య ఫ్యాన్స్ అయితే ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. తమ హీరోకు మంచి రోజులు మొదలయ్యాయని ఫుల్ జోష్‌లో ఉన్నారు.