శోభిత, చైతు ఎంగేజ్మెంట్.. సమంత సంచలన పోస్ట్ ?

frame శోభిత, చైతు ఎంగేజ్మెంట్.. సమంత సంచలన పోస్ట్ ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఏమాయ చేసావే సినిమా సమయంలోనే సమంతతో ప్రేమలో పడి కొన్నేళ్ల తర్వాత కుటుంబసభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. 


ఇక విడాకుల అనంతరం చైతన్య, సమంత సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి నాగచైతన్య, శోభిత ధూళిపాళతో లవ్ లో ఉన్నారని.... రిలేషన్ కొనసాగిస్తున్నారు అంటూ అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే చైతన్య, శోభిత ఇద్దరు కలిసి హైదరాబాద్ లోని తన నివాసంలో ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నాగచైతన్య అలాగే శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను నాగచైతన్య తండ్రి నాగార్జున   షేర్ చేసి మరి... ప్రకటించడం జరిగింది.


దీనికి సంబంధించిన విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడానికి కొన్ని గంటల ముందే సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో భాగంగా.... కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, ఎదుర్కొన్న వాళ్ళను పైనుంచి ఓ శక్తి కాపాడుతూ ఉంటుంది. ఆశక్తి ఎల్లప్పుడూ నీ చుట్టూ రక్షణగా ఉంటుంది.


అలాంటి సమయంలో నీ మానసిక ధైర్యం చాలా గొప్పది. నీకు ఎప్పుడు మేమంతా అండగా ఉంటాం అంటూ వినేష్ ఫోగట్ గురించి ఓ పోస్ట్ పెట్టింది అయితే వినేష్ ఫోగట్ తో పాటు తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పరోక్షంగా పోస్ట్ చేసిందని.... నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారనే బాధతోనే సమంత ఆ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: