కొడుకు ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసిన నాగార్జున.. ఫొటోస్ వైరల్..!

frame కొడుకు ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసిన నాగార్జున.. ఫొటోస్ వైరల్..!

Divya
అందరూ ఊహించినట్టుగానే ఎట్టకేలకు నాగచైతన్య,  ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా నాగార్జున దగ్గరుండి మరీ వీరిద్దరికి నిశ్చితార్థం చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇంకా ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే గతంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయాలపై వీరు స్పందించలేదు. అలాగని కొట్టిపారేసే ప్రయత్నం కూడా చేయలేదు.
అయితే నిన్న కూడా ఈరోజు వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ఒక వార్త వచ్చింది. అందరూ ఇది రూమర్ మాత్రమే అనుకున్నారు కానీ ఎట్టకేలకు నాగార్జున..  నాగచైతన్య , శోభిత ధూళిపాల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో కన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పాలి ఇక త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిపి నాగచైతన్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాలో నటించిన హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరు సంతోషంగా ఉన్నారనుకోగా అనూహ్యంగా విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో సమంత ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.  ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే నాగచైతన్య ఇంకొక అమ్మాయి అయినా శోభితతో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించారు.  దీంతో పెళ్లి చేసుకుంటారని అప్పుడే వార్తలు రాగా తాజాగా ఈ వార్తలకు ఇప్పుడు పులిస్టాప్ పడిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: