టాలీవుడ్లో మంచి
మాస్ ఇమేజ్ ఉన్న దర్శకుల్లో
బోయపాటి శ్రీను,
హరీష్ శంకర్ లు ముందుంటారు. వీళ్లు హీరోలను ప్రజెంట్ చేసే తీరు చాలా బాగుంటుంది. కానీ ఎందుకో వీళ్ళు
సినిమా చేయాలి అనుకున్నప్పుడు స్టార్లు అందుబాటులో ఉండరు.
బోయపాటి శ్రీను సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన రాంచరణ్ ,
ఎన్టీఆర్ ,
అల్లు అర్జున్ వంటి స్టార్లతో సినిమాలు తీసినప్పటికీ, పవన్
కళ్యాణ్, మహేష్ బాబుల వరకు వెళ్లలేకపోయాడు. హరీష్ శంకర్.. ది కూడా సేమ్ సిట్యుయేషన్.మహేష్ బాబుతో సినిమాలు చేసింది అందరి డైరెక్టర్లకి వుంటుంది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్లు మహేష్ ని ద్రుష్టిలో పెట్టుకొని కథలు రెడీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షిస్తారు.
హరీష్ శంకర్ డైరెక్టర్ మహేష్ తో
సినిమా చేయాలని అనుకున్నారు.
గబ్బర్ సింగ్ హిట్ తో హరీష్ కి ఇండస్ట్రీలో అన్నీ తలుపులు తెర్చుకున్నారు. ఆయన కథకు వినడానికి అందరూ ఆసక్తి చూపారు. ఈ సమయంలోనే మహేష్ తో
సినిమా అనుకున్నారు హరీష్. అయితే రామయ్య వస్తావయ్యా ఫలితం హరీష్ ని వెనక్కి లాగింది. ఆయన ప్లాన్స్ అన్నీ అటు ఇటు అయిపోయాయి. అయితే ఎప్పటికైనా మహేష్ తో
సినిమా చేయాలని ఉంది హరీష్. తాజాగా బచ్చన్ ట్రైలర్ లాంచ్
ఈవెంట్ లో ఈ టాపిక్ వచ్చింది. 'మహేష్ బాబు గారితో
పోకిరి లాంటి
సినిమా తీయాలని వుంది' అని తన మనసులో మాట బయటపెట్టారు హరీష్.'మహేష్ బాబులో మంచి
కామెడీ టైమింగ్ ఉందని, సరిగ్గా దాన్ని వాడితే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని.., మహేష్ తో
సినిమా చేస్తే కచ్చితంగా దాన్ని ఎక్కువగా వాడాలని ఆశపడుతున్నట్లు’
హరీష్ శంకర్ తెలిపాడు.
తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్ లో కూడా తన కోరికని మరోసారి బయటపెట్టాడు. కానీ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో
సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కాబట్టి.. హరీష్ కోరిక ఇప్పట్లో తీరడం కష్టమే.మరి మహేష్ బాబును హీరోగా ఎలాంటి రోల్ లో చూపించాలని హరీష్ అనుకుంటున్నాడు తెలియాలి. మరోసారి
పోకిరి లాంటి ఫుల్
మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించితే మహేష్ అభిమానులకు పండుగే.మరోవైపు పవన్
కళ్యాణ్ రవితేజ కాంబినేషన్లో
సినిమా తీయాలని ఉందని చెప్పారు. పాన్
ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వని,తన స్టైల్ సినిమాలు చేస్తానని తెలిపారు.హరీష్ మంచి
మాస్ పల్స్ తెలిసిన డైరెక్టరే. మహేష్ బాబు టైమింగ్ ని పట్టుకునే సత్తా ఆయనలో వుంది. కాకపోతే ఇప్పుడు మహేష్ బాబు,
రాజమౌళి సినిమాతో వున్నారు. దాదాపు మూడేళ్ళు ఈ సినిమాకే పట్టేసింది.
రాజమౌళి సినిమా తర్వాత హీరోల లీగ్ మొత్తం పాన్
ఇండియా చుట్టూ తిరుగుతుంది. అప్పటికి ఎలా వుంటుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు.