24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 తెలుగు సాంగ్స్ ఇవే..!

frame 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 తెలుగు సాంగ్స్ ఇవే..!

Pulgam Srinivas
విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 తెలుగు లిరికల్ వీడియో సాంగ్స్ ఏవో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలోని దమ్ మసాలా అంటూ సాగే సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 17.42 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలోని పెన్నీ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 16.38 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన చట్టమల్లే అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 15.68 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 14.78 మిలియన్ వ్యూస్ దక్కాయి. మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని మా మా మహేశా అనే సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 13.56 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: