రెండు మాస్ సినిమాలే కానీ..?

frame రెండు మాస్ సినిమాలే కానీ..?

shami
ఆగష్టు 15 న తెలుగు బాక్సాఫీస్ పై ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా వస్తుండగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అవుతుంది. కమర్షియల్ లెక్కల్లో చూస్తే అవి రెండు పక్కా మాస్ మసాలా సినిమాలే. ఐతే రవితేజ మిస్టర్ బచ్చన్ కథ వేరు.. రామ్ డబుల్ ఇస్మార్ట్ కథ వేరు. కానీ రెండు సినిమాల టార్గెట్ ఆడియన్స్ మాత్రం ఒక్కరే. వాళ్లే మాస్ ఆడియన్స్. మాస్ ప్రేక్షకులను మెప్పిస్తే చాలు ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క.
మాస్ మహరాజ్ రవితేజ స్టామినాని పర్ఫెక్ట్ గా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ కోసం వాడినట్టు కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తే సినిమా కచ్చితంగా మ్యాజిక్ చేసేలా ఉంది. ఇక హీరోయిన్ భాగ్య శ్రీ అందాలు ఆడియన్స్ కి ఫుల్ కిక్ అందిస్తున్నాయి. ఐతే రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా పక్కా మాస్ మూవీగా వస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో ఆల్రెడీ శంకర్ క్యారెక్టర్ తో ఆడియన్స్ కు దగ్గరైన రామ్ మరోసారి అదే పాత్రలో కొత్త కథతో వస్తున్నాడు.
రామ్ వర్సెస్ రవితేజ అనడం కన్నా డైరెక్టర్స్ హరీష్ శంకర్ వర్సెస్ పూరీ ఫైట్ అంటే బాగుంటుంది. ఐతే ఈ ఫైట్ పై హరీష్ శంకర్ వెర్షన్ ఏంటంటే పూరీ నాకు గురు సమానుడు ఆయన స్థాయి వేరు కానీ కొన్ని ప్రొడ్యూసర్ తాలూకా లెక్కల వల్ల డబుల్ ఇస్మార్ట్ కి పోటీగా రావాల్సి వస్తుందని అన్నారు. ఐతే సినిమా ప్రమోషన్స్ విషయంలో రెండు కూడా నువ్వా నేనా అనేలా ఉన్నాయి. మరి ఫైనల్ విజేత ఎవరన్నది మాత్రం ఆగష్టు 15 మొదటి ఆట పడ్డాక తెలుస్తుంది. అప్పటిదాకా ప్రమోషనల్ కంటెంట్ ని చూసి ఎంత అంచనా వేసినా ఫైనల్ రిజల్ట్ ఊహించడం కష్టం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: