మెగా బ్రదర్ నాగబాబు సినీ వారసులుగా ఇప్పటికే తన కుమారుడు వరుణ్ తేజ్ , తన కుమార్తె నిహారిక సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ను మంచి జోష్లో ముందుకు సాగిస్తున్నాడు. నిహారిక కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు సినిమాల ద్వారా విజయాలు దక్కలేదు. ప్రస్తుతం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. తాజాగా ఈమె కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఓ ఈవెంట్ నీ నిర్వహించింది.
దానికి నాగబాబు మరియు టాలీవుడ్ యువ నటులు అయినటువంటి వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ , అడవి శేషు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా నాగబాబు మాట్లాడుతూ ... నాకు అడవి శేషు అంటే చాలా ఇష్టం. ఆయన రొటీన్ కమర్షియల్ సినిమాలలో కాకుండా వైవిధ్యమైన సినిమాలలో నటిస్తాడు. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇక మా సాయి ధరమ్ తేజ్ అంటే కూడా నాకు మొదట్లో ఇష్టం ఉండేది కాదు. కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేసేవాడు. కానీ ఇప్పుడు సాయి తేజ్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. అందుకే నాకు బాగా నచ్చుతున్నాడు అన్నాడు. ఇక మా అబ్బాయి వరుణ్ తేజ్ అంటే నాకు మొదటి నుండి ఇష్టం.
ఎందుకు అంటే కమర్షియల్ సినిమాల జోలికి ఎప్పుడూ పోడు. ఎప్పుడు డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ ఉంటాడు. నేనే ఒకసారి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేయొచ్చు కదా అని అడిగాను. దానికి వరుణ్ అలాంటి సినిమాలు చాలా వస్తాయి. అందులో చాలా తక్కువ శాతం మాత్రమే ప్రేక్షకులను మెప్పిస్తాయి. డిఫరెంట్ సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. కానీ ఎక్కువ శాతం ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు. అందుకే కమర్షియల్ సినిమాల కంటే వైవిధ్యమైన సినిమాలే చేస్తాను అని సమాధానం ఇచ్చాడు. అందుకే వరుణ్ అంటే చాలా ఇష్టం అని నాగబాబు తాజా ఈవెంట్ లో బాగంగా అన్నాడు.