టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ కలిగి ఉన్న దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు . ఈయన ఎప్పుడూ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాల వైపు వెళ్లకుండా ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే వచ్చాడు . అందులో భాగంగా ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈయనకు క్రియేటివ్ దర్శకుడు అనే పేరు కూడా లభించింది. ఇది ఇలా ఉంటే ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు అద్భుతంగా ఉండడం విషయం పక్కన పెడితే ఈయన హీరోలను అదిరిపోయే రేంజ్ లో వాడుకుంటాడు.
ప్రతి నటుడు లోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీసుకు వస్తాడు అనే గొప్ప పేరు కూడా ఇతనికి ఉంది. దానితో స్టార్ హీరోలు కూడా కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తారు. కృష్ణ వంశీ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమాలను తెరకెక్కించాడు. మహేష్ బాబు తో కృష్ణ వంశీ తెరకెక్కించిన మురారి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ... ఎన్టీఆర్ తో రూపొందించిన రాఖీ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది.
తాజాగా కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడాడు. అందులో భాగంగా ఈయన జూనియర్ ఎన్టీఆర్ కి మురారి సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమా లాంటిదే నాతో చేయండి అని చాలా సార్లు అడిగాడు. కాకపోతే నీపై రాఖీ లాంటి సినిమా అనే వర్కౌట్ అవుతుంది అని చెప్పాను అని కృష్ణ వంశీ తాజాగా అన్నాడు. కృష్ణవంశీ కొంత కాలం క్రితం రంగమార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.