'దేవర' చుట్టమల్లే పాటలో.. రోహిత్ - రితిక చేస్తే?
కాగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈ మూవీ నుండి ఒక్కో సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేస్తూ ఉంది. కాగా ఇటీవల జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ ల రొమాంటిక్ సాంగ్ చుట్ట మల్లే ను ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేయగా.. ఇది ఇంటర్నెట్లో ట్రేండింగ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఎంతోమంది ఈ పాటను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుంటూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అయితే ఇలా జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న దేవర మూవీ లో నుంచి విడుదలైన చుట్ట మల్లే సాంగ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడి భార్య రితిక డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అయినా ఈ పాటపై వాళ్ళు ఎందుకు డాన్స్ చేస్తారు అని అనుకుంటున్నారు కదా. అయితే డాన్స్ చేయలేదు కానీ ఎవరో రోహిత్ అభిమాని అటు రోహిత్ శర్మ, రితిక వీడియోలను ఫోటోలను జత చేసి.. ఇకఈ పాటను యాడ్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేయగా.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి ఫ్యాన్స్ అందరు కూడా తెగ మురిసిపోతున్నారు. చుట్ట మల్లే పాటకు అటురోహిత్, రితిక బాగా సరిపోయారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.