రాజమౌళి వ్యక్తిగత జీవితం !

frame రాజమౌళి వ్యక్తిగత జీవితం !

Seetha Sailaja
ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ టాప్ దర్శకుడుగా ఒక వెలుగు వెలుగుతున్న రాజమౌళి తాను దర్శకత్వం వహించే సినిమాకు 100 కోట్ల పారితోషికం తీసుకుంటాడు అన్న ప్రచారం ఉంది. ఇంత భారీ పారితోషికాన్ని తీసుకునే రాజమౌళి వ్యక్తిగత జీవితం మటుకు చాల సాదాసీదాగా ఉంటుంది. అత్యంత ఖరీదైన విలాశవంతమైన కార్లు లక్షలు విలువ చేసే వాచీలు ఆయన ఉపయోగించడు.

ఆయన ఆహారపు అలవాట్లు కూడ సాధారణంగానే ఉంటాయి. రాజమౌళి కుటుంబం ఒకప్పుడు అనేక ఆర్థిక బాధలు పడిన పరిస్థితులలో అతను వేసే ప్రతి అడుగు ఆయన గతాన్ని మర్చిపోకుండా అత్యంత సామాన్యంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడ రాజమౌళి విలాశవంతమైన హోటల్స్ లో ఉండడు. అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే రాజమౌళి వ్యక్తిగత జీవితం ఇప్పటికీ సామాన్యంగానే ఉంటుంది.

లేటెస్ట్ గా రాజమౌళి తన హోమ్ ధియేటర్ లో తన సమిష్టి కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఒక సినిమాను చూస్తున్న ఫోటోను షేర్ చేశాడు. జక్కన్న కుటుంబ సభ్యులలో చాలామంది ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. వారంతా నెల పై పడుకుని ఆసినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వారిని చూసి జక్కన్న ఆనంద పడుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తీసే ప్రతి సినిమాకు కేవలం కీరవాణి మాత్రమే కాకుండా రమా రాజమౌళి జక్కన్న కజిన్స్ అంతా కలిసి ఐక్యతగా సినిమాకు పనిచేస్తూ ఉంటారు.

క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా జక్కన్న తీసే సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోను చాల లోతుగా విశ్లేషణలు చేస్తూ సూచనలు ఇస్తూ ఉంటారు. కుటుంబం మొత్తం ఒక ఇండస్ట్రీలా కలిసి పనిచేస్తారు కాబట్టి ఇప్పటివరకు పరాజయం అన్నపదం రాజమౌళి కాంపౌండ్ ను టచ్ చేయలేదు అనుకోవాలి. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న సినిమా పై 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు అన్న వార్తలను బట్టి ప్రపంచ స్థాయి దర్శకుడుగా రాజమౌళి ఎదిగిపోయాడు అన్న భావన అందరిలోను కలుగుతుంది..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: