హీరో శర్వానంద్ పేరు చెప్పగానే యూత్ ఫుల్ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, ఆహ్లాదభరితంగా సాగే ప్రేమ కథలు గుర్తుకు వస్తాయి. శర్వానంద్ తన ఇమేజ్ కి భిన్నంగా పెద్దగా ప్రయోగాలు చేయలేదు. ఒకటి రెండు చిత్రాలు ఉన్నప్పటికీ అవి వర్కౌట్ కాలేదు.ఇదిలా ఉండగా శర్వానంద్ తదుపరి చిత్రంపై క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఫక్తు మాస్ చిత్రాలు తెరకెక్కించే సంపత్ నందితో శర్వానంద్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి సంపత్ నంది.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా గంజా శంకర్ అనే చిత్రం తెరకెక్కించాలి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. వివిధ అడ్డంకుల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. దీనితో సంపత్ నంది మరో హీరో కోసం వెతుకుతుండగా శర్వానంద్ తో కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇది విచిత్రమైన కాంబినేషన్ అనే చెప్పాలి. ఒక వైపు సాఫ్ట్ గా యూత్ ఫుల్ చిత్రాలు చేసే హీరో.. మరోవైపు పక్కా మాస్ చిత్రాలు చేసే డైరెక్టర్ కలవబోతున్నారు. దీనితో సంపత్ నంది ఎలాంటి కథ రెడీ చేశారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పీపుల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. ఈ నటుడు చివరిసారిగా మనమే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రం తరువాత శర్వా36, శర్వా37 చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మరోక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.హీరో శర్వానంద్, క్రియేటివ్ డైరెక్టర్ సంపతి నంది దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది కన్ఫర్మ్ అయితే శర్వానంద్ నటించే 38 వ చిత్రం ఇదే కానుంది. ఇక ఈ నటుడు నటించిన మనమే చిత్రం రిలీజై ఇన్ని రోజులు అవుతున్నప్పటికి, ఇంకా ఓటిటి లోకి రాలేదు. మనమే డిజిటల్ ప్రీమియర్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.