ఓటీటీ ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న అల్లు శిరీష్ మూవీ.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..?

frame ఓటీటీ ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న అల్లు శిరీష్ మూవీ.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..?

lakhmi saranya
అల్లు శిరీష ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. గౌరవం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తరువాత శ్రీరస్తు శుభమస్తు, ABCD, ఊర్వశివో రాక్షసివో ఇలాంటి మూవీల్లో హీరోగా నటించిన సంగతి తెలిసింది. ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న మూవీ బడ్డీ. అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ మూవీ ఓటిటి ప్లాట్ ప్లాట్ ఫామ్ ఫిక్సయింది. ఫాంటసి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ గత శుక్రవారం (ఆగస్టు 2న) రిలీజ్ అయింది. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటించారు.తమిళంలో ఆర్య హీరోగా 2021లో విడుదలైన డెడ్డి మూవీకి రీమేక్ గా బడ్డి రూపొందింది.

బడ్డి తో దాదాపు రెండేళ్ల తరువాత అల్లు శిరీష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ డైమ్ యాక్షన్ రోల్లో కనిపించాడు. కానీ అతడికి ఈ మూవీ సక్సెస్ ను తెచ్చి పెట్టలేకపోయింది. బడ్డీ సినిమా డిజిటల్ హక్కులను నెట్లిక్స్ సొంతం చేసుకున్నది. థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే బడ్డీ ఓటిటిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అల్లు శిరీష్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. తెలుగు తో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో బడ్డీ రిలీజ్ అవుతుందని తెలిసింది. ఆగస్ట్ లాస్ట్ వీక్ లో బడ్డీ ఓటిటి రిలీజ్  డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు సమాచారం.

బడ్డీ సినిమాలో ఆదిత్య అనే పైలెట్ పాత్రలో అల్లు శిరీష్ కనిపించాడు. ఎయిర్ లైన్స్ లోనే  పనిచేసే పల్లవిని (గాయత్రి భరద్వాజ్) ఆదిత్య ప్రేమిస్తాడు. అనుకోకుండా పల్లవి కారణంగా ఆదిత్య ఉద్యోగం పోతుంది. ఆదిత్య కు క్షమాపణ చెప్పటమే కాకుండా తన మనసులోని ప్రేమను అతడికి చెప్పాలనుకుని బయలుదేరిన పల్లవి కనిపించకుండా పోతుంది. పల్లవి మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీని ఆదిత్య ఎలా ఛేదించాడు? పల్లవి ఆత్మ ఓ డెడ్డి బేర్ లోకి ఎలా వచ్చింది? డెడ్డి బేర్ సమయంతో హ్యూమన్ ఆర్గాన్స్ ఇల్లీగల్ బిజినెస్ చేసే డాక్టర్ అర్జున్ కుమార్ వర్మ దురాగతాలను ఆదిత్య ఎలా బయటపెట్టాడు? అన్నదే బడ్డీ మూవీ కథ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: