దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తోంది. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ నలుమూలల విస్తరించేలా చేశారు రాజమౌళి. బాహుబలి సినిమాతో తానేంటో దేశానికి తెలిసేలా చేసిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. రాజమౌళి చేసిన సినిమాలు 13 సూపర్ హిట్స్.. అపజయం అంటూ ఎరుగక దూసుకుపోతున్నారు. ఆయన చేసిన సినిమాలన్నింటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చేశారు. తారక్ తో జక్కన్న నాలుగు సినిమాలు చేశారు. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలనీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇక అలాంటి రాజమౌళి ఓ పెళ్లై కొడుకు ఉన్న ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక పెళ్లి కూడా చేసుకున్నాడు. 1973లో కేవీ విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు జన్మించాడు రాజమౌళి.తండ్రి విజయేంద్ర ప్రసాద్.. రచయిత డైరెక్టర్. మరోవైపు సంగీత దర్శకుడు కీరవాణి పెదనాన్న కొడుకు. అంటే రాజమౌళికి అన్న అవుతాడు. ఇక రాజమౌళి చిన్నప్పుడు జులాయిగా తిరుగుతున్న సమయంలో వదిన శ్రీవల్లి చెప్పిన మాటలతో తను ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇక శాంతి నివాసం అనే సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న క్రమంలో రమతో పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే పెళ్లై కొడుకు ఉన్న రమతో రాజమౌళి ప్రేమలో ఎలా పడ్డారో ఈ విషయం చాలా మందికి తెలియదు.కీరవాణి, రాజమౌళి ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు అన్న విషయం తెలిసిందే. ఇక కీరవాణి భార్య శ్రీవల్లి. ఆమెకు రమ సోదరి. అలా రమ, రాజమౌళికి పరిచయం ఏర్పడింది. ఇక రాజమౌళి... రాఘవేంద్రరావు శిష్యుడిగా.. శాంతినివాసం సీరియల్ దరకత్వం వహించే అవకాశం రాగా.. ఆ సీరియల్ ను తెరకెక్కించే టైంలోనే రాజమౌళి రమతో సన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా డైరెక్ట్ చేసే టైంకి ప్రేమ కూడా చిగురించింది.ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుండగా...
సెన్సేషన్, సక్సెస్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి పై నెట్ ప్లిక్స్ వారు ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. రాజమౌళి.. జీవిత విశేషాలతో ఈ డాక్యుమెంటరీ రూపొందింది.
ఈ డాక్యమెంటరీని 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుందో చెప్పే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవి అభిమానులు ఓ రేంజిలో అలరిస్తున్నాయి. రాఘవ్ కన్నా దర్శకత్వంలో రానున్న ఈ ప్రాజెక్టును సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘నేనొక అద్భుతమైన కథ చెప్పాలనుకుంటున్నాను’ అంటూ మొదలైన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లోని సినీ ప్రముఖులు రాజమౌళిపై వారికున్న అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి డబ్బింగ్ చెప్పించిన వాయిస్ లతో ఇబ్బందిగా ఉంది అంటున్నారు ట్రైలర్ చూసిన వాళ్లు. ఈ వెర్షన్ లో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లకు వేరే ఆర్టిస్ట్ ల చేత డబ్బింగ్ చెప్పించారు. అవి చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని, ఏ విధమైన ఇంపాక్ట్ కలగచేయటం లేదని అంటున్నారు. ఈ విషయంలో నెట్ ప్లిక్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇంగ్లీష్ ట్రైలర్ లో వారి ఒరిజనల్ వాయిస్ లు ఉన్నాయి. రాజమౌళి వాయిస్ సైతం డబ్బింగ్ చెప్పించటం కాస్త ఇబ్బందే. ఆ విషయంలో విమర్శలు రావటం అభిమానుల నుంచి అనేది పెద్ద విచిత్రమైతే కాదు.
ఇప్పటివరకు ఎవరూ చెప్పని కథలను ప్రపంచానికి తెలిపేందుకే రాజమౌళి జన్మించారంటూ’ ఎన్టీఆర్, ‘ఇలాంటి దర్శకుడిని నేనిప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చిప్రేమ’ అంటూ ప్రభాస్, ఆయన చిత్రాల్లో తనని తాను కొత్తగా చూసుకొని ఎంతో ఆశ్చర్యపోయానంటూ రామ్‌చరణ్, హాలీవుడ్ దర్శకనిర్మాత జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ..‘రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం’ అని తెలుపారు.కరణ్ జోహార్ ‘ఈ దర్శకుడు ఓ లెజెండ్’ అని, ఆయనతో పని చేసిన వారందరూ ఆయణ్ని పని రాక్షసుడని పిలుస్తుంటారంటూ రాజమౌళి భార్య రమ ట్రైలర్‌లో వారి అభిప్రాయాల్ని తెలిపారు.కానీ ఖాళీ సమయాల్లో మాత్రం ఆయనకు మహా బద్దకమట నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ లో రమా రాజమౌళి ఈ విషయాన్నీ వెల్లడించారు. "షూటింగ్ లేదంటే అయనకు చాలా బద్దకం ఏదో ఆలోచిస్తుంటారు. ఒక్కోసారి బయటకు వెళ్లి గేమ్స్ ఆడతారు".అని తెలిపారు.ఖాళీ గా ఉంటే వ్యవసాయం, ఆటలు, కుటుంబం పైనే తన ఆలోచలు వుంటాయని జక్కన్న తెలిపారు.‘నిజం చెప్పాలంటే నేను కేవలం నా కథకు మాత్రమే బానిసను..’ అంటూ ట్రైలర్ ఆఖర్లో రాజమౌళి చెప్పిన డైలాగ్ సినిమాల పట్ల తనకున్న ప్రేమకు నిదర్శనం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ వచ్చే నెల 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇక ఇది డాక్యుమెంటరీ కాబట్టి సినిమా స్టైల్లో ఉండదు. రాజమౌళి కెరీర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైందనేది విజువల్స్ రూపంలో చూపిస్తారు. అలానే జక్కన్నతో పనిచేసిన అనుభవాన్ని ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇది డాక్యుమెంటరీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. రాజమౌళి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని చూడటం మేలు. ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుssmb29పనిలో బిజీ గా వున్నారు.