యాంకర్ సుమకి స్టేజ్ పైనే ముద్దు పెట్టిన నటుడు.. అందరూ షాక్?

frame యాంకర్ సుమకి స్టేజ్ పైనే ముద్దు పెట్టిన నటుడు.. అందరూ షాక్?

praveen
యాంకర్ సుమ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు 2 దశాబ్దాల నుంచి కూడా తెలుగు ప్రేక్షకులు అందరినీ కూడా అలరిస్తూ వస్తుంది ఆమె. ఒకప్పుడు నటిగా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుమ.. ఇక బుల్లితెరపై యాంకర్ గా అవతారం ఎత్తిన తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పుడు తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా ప్రస్థానం కొనసాగిస్తుంది. ఏదైనా షో నిర్వహించాలనా లేదంటే ఏదైనా సినిమా ఈవెన్ నిర్వహించాలన్న స్టార్ దర్శక నిర్మాతలు అందరికీ కూడా సుమ ముందుగా గుర్తుకు వస్తూ ఉంటుంది.

 ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ హీరో సినిమా ఈవెంట్ జరిగిన సరే ఆ ఈవెంట్ కి హోస్టింగ్ చేసేది యాంకర్ సుమనే. అంతలా తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆమె కనెక్ట్ అయిపోయింది. ఇక తన వాక్చాతుర్యంతో ఎలాంటి షో అయిన ఎలాంటి సినిమా ఈవెంట్ అయినా సరే రక్తి కట్టించగల సత్తా ఆమె సొంతం అని చెప్పాలి. అయితే ఇక ఎలాంటి సినిమా ఈవెంట్ చేసినా కూడా సుమ ఎంతో హుందాతనంతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరి పైన పంచులు వేసిన అవి ఎంతో హుందాగా ఉంటాయి అని చెప్పాలి.

 అలాంటి యాంకర్ సుమకు ఇటీవల స్టేజ్ పైన ఊహించని షాక్ తగిలింది. ఏకంగా సినిమా ఈవెన్ నిర్వహిస్తున్న సమయంలో ఒక నటుడు స్పీచ్ పూర్తయిన తర్వాత ఏకంగా యాంకర్ సుమకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమె చేతి మీద ముద్దు పెట్టాడు. దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అయింది. తంగలాన్ ప్రీ రిలీజ్  వేడుకలో ఆమె సందడి చేశారు. యాక్టర్ డేనియల్ తో తెలుగులో మాట్లాడించే ప్రయత్నంలోనే... డేనియల్ ఆమె చేతిపై ముద్దు పెట్టారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సుమా కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. రాజా ఈయన నాకు అన్నయ్య.. రాఖీ పండుగ వస్తుంది కదా అంటూ తన భర్తను ఉద్దేశిస్తూ సుమా కామెంట్స్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: