మురారి మ్యానియాకు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

frame మురారి మ్యానియాకు షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆరోజు మహేష్ రాజమౌళిల సినిమాకు సంబంధించిన టైటిల్ ఎనౌన్స్ మెంట్ కానీ లేదంటే ఈమూవీలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ కు సంబంధించిన పోస్టర్ కానీ విడుదల చేస్తారని మహేష్ అభిమానులు చాల ఆశలు పెట్టుకున్నారు. అయితే అభిమానుల ఆశలు రాజమౌళి తీర్చే అవకాశం కనిపించడంలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి.

దీనితో సూపర్ స్టార్ అభిమానులు నిరుత్సాహానికి లోను కాకుండా మరొక విధంగా తమ వీరాభిమానాన్ని చాటుకోవడానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి మహేష్ పుట్టినరోజునాడు ‘ఒక్కడు’ ‘మురారి’ సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. వాస్తవానికి ఈ రెండు సినిమాలు ఛానల్స్ లో అనేకసార్లు ప్రసారం అయ్యాయి.

అయినప్పటికీ ఈరెండు సినిమాలను మహేష్ పుట్టినరోజునాడు చాల ధైర్యంగా రీ రిలీజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘మురారి’ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్య పోతున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన టిక్కెట్లు బుక్ మై షోలో ఓపెన్ అయిన తరువాత వాటిని వేగంగా కొని ఒక రికార్డును క్రియేట్ చేయాలని మహేష్ అభిమానులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా హైద్రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ రెండు సినిమాలు విడుదల అయ్యే ధియేటర్లలో మహేష్ పుట్టినరోజునాడు హంగామా చేయడమే కాకుండా మహేష్ కటౌట్ కు పాలాభిషేకాలు చేస్తూ తమ వీరాభిమానాన్ని చాటుకోవాలని ఆలోచనలలో అభిమానులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా మహేష్ రాజమౌళిల మూవీ ప్రారంభం కావడానికి మరికొన్ని నెలలు పట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈసినిమాను ఆఫ్రికా అడవులలో తీయబోతున్న నేపధ్యంలో అక్కడి వాతావరణ పరిస్థితులు నవంబర్ నుండి అనువుగా ఉంటాయి కాబట్టి అప్పటి నుండి ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టి 2026 సమ్మర్ లో ఈసినిమాను విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: