తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్న యువ నటీమణులలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత కంచె మూవీలో నటించి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె అడపా దడపా సినిమాలో నటించిన వాటిలో అందాలను ఆరబోయడం తప్ప ఈమెకు ఆ మూవీల ద్వారా వచ్చింది ఏమీ లేదు. అలాంటి సమయంలోనే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రగ్య హీరోయిన్గా నటించింది.
ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ గుర్తింపు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ , బోయపాటి కాంబోలో రూపొందిబోయే అఖండ 2 సినిమాలో కూడా ప్రగ్య నే హీరోయిన్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన "ఖేల్ ఖేల్ మే" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది. సినిమాల్లో విపరీతమైన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఇచ్చే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ నటించిన హిందీ మూవీ "ఖేల్ ఖేల్ మే" మంచి విజయం సాధించినట్లయితే ఈమెకు హిందీ లో కూడా భారీ అవకాశాలు దక్కే అవకాశం ఉంది.