ప్రమోషన్లతో రెచ్చిపోతున్న మిస్టర్ బచ్చన్ యూనిట్.. నిన్న మెట్రో.. ఇవాళ మరో రకం..!

frame ప్రమోషన్లతో రెచ్చిపోతున్న మిస్టర్ బచ్చన్ యూనిట్.. నిన్న మెట్రో.. ఇవాళ మరో రకం..!

Pulgam Srinivas
సినిమాలు ఎంత బాగా తీశామో అన్నది కాదు ముఖ్యం. సినిమాను ప్రమోషన్లతో ఎంత బాగా ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లాము అనేదే ముఖ్యం. సినిమాను బాగా తీసిన ప్రమోషన్లు కరెక్ట్ చేయనట్లు అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన తర్వాత దానిని చూసేవారు కూడా లేక సినిమాకు విమర్శకుల నుండి , ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వచ్చిన దానిని ఓ టీ టీ లో చూసేద్దాంలే అని ప్రేక్షకులు లైట్ తీసుకునే రోజులు ఇవి. అందుకోసం అనే సినిమాను ఎంత బాగా తీస్తే అంతకుమించిన ప్రమోషన్లను చేసి జనాలను థియేటర్ వరకు తీసుకురావాల్సిన లక్ష్యం మూవీ బృందాలది.

దానితో కొంత మంది సినిమా తర్వాత చాలా టైం ను పెట్టుకొని మరీ ప్రమోషన్లను చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ  బోర్స్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రలో నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం ఈ మూవీ బృందం హైదరాబాదు లోని మెట్రో ట్రైన్ లో రవితేజ వాయిస్ తో ఈ సినిమా చూడండి అనే క్లిప్ ను వేశారు. దీనితో అది సెన్సేషనల్ గా మారింది. ఇక మరో అడుగు ముందుకు వేసి ఈ మూవీ బృందం ఆటోలపై మిస్టర్ బచ్చన్ పోస్టర్లకు అంటించి ప్రచారాలను చేయిస్తుంది. ఇలా అదిరిపోయే రేంజ్ లో మిస్టర్ బచ్చన్ మూవీ యూనిట్ ప్రచారాలను చేస్తూ సినిమాలు జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: